ప్రధానితో రేవంత్ భేటీ - కీలక అంశాలపై చర్చ..!!
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు... పెండింగ్ అంశాల పైన సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన రేవంత్ వివరించారు. మరింత అనుభవం ఉన్న వారిని రంగంలోకి దించే అంశం పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధానికి వినతులు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానితో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు కు రూ.24269 కోట్లు ఇవ్వాలని రేవంత్ విజ్ఞప్తి చేసారు. అదే విధంగా 55 కిలోమీటర్ల మేర పొడవు ఉన్న మూసీ నదికి పునర్జీవం కల్పించడం మూసీ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఇందు కోసం మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఇవ్వాలని ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టు అవసరం గురించి ప్రత్యేకంగా రేవంత్ వివరించారు.

రేవంత్ అభ్యర్దన
ఇక, తెలంగాణకు 29 మంది ఐపీఎస్‌ల కొరత ఉందని ప్రధానికి తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్, అడ్వాన్స్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్బుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభు త్వం లక్ష్యంగా ఎంచుకుందని మోదీకి వెల్లడించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్ట్‌ల స్థితిని ప్రధానికి వివరించారు. అన్నింటిని విన్న ప్రధాని కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్ బీసీ ఘటన పైన రేవంత్ ఈ సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఆపరేషన్.. ఈ ఘటనలో చిక్కకున్న ఎనిమిది మంది గురించి ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. టన్నెల్ సహాయక చర్యలు.. ఎదురవుతున్న ఆటంకాల గురించి సీఎం రేవంత్ సాంకేతిక అంశాలను వివరించారు.
ప్రధాని ఆరా
టన్నెల్ సహాయక చర్యల కోసంఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దించే అంశం ప్రస్తావన కు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన రేవంత్.. రాష్ట్రంలో వాటి అవసరాలను వివరించారు. అదే విధంగా ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పలువురు కేంద్రమంత్రులను కూడా రేవంత్ కలవనునున్నారు.












Click it and Unblock the Notifications