సీబీఐ చేతికి మరో కీలక కేసు, టార్గెట్ ఫిక్స్ - రేవంత్ సంచలనం..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ ముఖ్యులే లక్ష్యంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన నివేదిక పై ప్రత్యేక అసెంబ్లీ భేటీలో చర్చించి.. సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా మరో కీలక కేసును అదే సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్యుల పైన పలు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఈ కేసును సీబీఐకి అప్పగించటం ద్వారా రేవంత్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసును సీబీఐకి అప్పగించిన రేవంత్.. మరో కేసు అప్పగింత పైన దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు.

ఆ క్రమంలో పలువురిని సైతం విచారించారు. అందులో భాగంగా ముఖ్యమైన ఆధారాలను సేకరించిన అధికారులు తాజాగా ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో, ఈ కేసును సీబీఐకి అప్పగించటం పైన రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విపక్ష పార్టీల్లోని కీలక నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని పలువురు నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో పలువురు ముఖ్యులు ఉన్నట్లు ప్రచారం సాగింది.
ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయ్యారు. ఈ కేసును సైతం సీబీఐకి అప్పగించేందుకు రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హాయంలో ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు గుర్తించిన వారికి సిట్ నోటీసులు ఇచ్చింది. వారి నుంచి సమాచారం సేకరించింది.
కాగా, నాటి ప్రభుత్వంలోని ముఖ్యులు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి ఫోన్లు నాడు ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా ఈ వ్యవహారం లో బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీ నేతలు టార్గెట్ చేసారు. గతంలో పలువురు బీజేపీ నేతలు సైతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసారు. దీని పైన మంత్రివర్గ సహచరులతో చర్చించిన తరువాత సీఎం రేవంత్ ఈ కేసు సీబీఐకి అప్పగింత పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications