జూబ్లీహిల్స్ ఫలితం పై తేల్చేసిన రేవంత్, హైకమాండ్ సీరియస్..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన అంచనాలు పెరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడి ఫలితం పైన తేల్చేసారు. ఇక్కడ గెలుపు ప్రభుత్వానికి.. మంత్రులకు కీలకమని స్పష్టం చేసారు. హైకమాండ్ ఈ ఎన్నిక పైన సీరియస్ గా ఉందని.. అందరి పని తీరు పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో మంత్రులు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం ఇచ్చిన ముఖ్యమంత్రి... కొత్తగా మరో కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రచారినికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
జూబ్లీహిల్స్ ఫలితం పైన సీఎం రేవంత్ తేల్చేసారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెబుతూనే.. ఏ మాత్రం అలసత్వం వద్దని మంత్రులకు స్పష్టం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఓటరు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ ఎన్నిక ప్రభుత్వానికి, మంత్రులకు కూడా కీలకమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక పైన సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మంత్రులతో విందు సమావేశం నిర్వహించారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారం, ఇతర కార్యక్రమాలపై సీఎం సమీక్ష జరిపారు. అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు.
కాగా, ఈ సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉప ఎన్నిక ప్రభుత్వానికి చాలా కీలకమని, మంత్రులంతా సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఎవరి పనితీరు ఎలా ఉందన్నది అధిష్ఠానం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ చేస్తున్న ఆ తప్పుడు ప్రచా రాలను, తప్పుడు సర్వేలను మంత్రులు బలంగా తిప్పి కొట్టాలని సూచించారు.
పోల్ మేనేజ్ మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బూత్ స్థాయి ఏజెంట్‌ను పెట్టి, పర్యవేక్షించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని సమన్వయం చేసుకునేందుకు కో-ఆర్డినేషన్ కమిటీని నియమించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కో-చైర్మన్‌గా, మరో 14 మంది సభ్యులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications