పెండింగ్ పథకాల పై రేవంత్ కీలక ప్రకటన..!!

కీలక నిర్ణయాల దిశాగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. విదేశీ పర్యటన ఆ తరువాత ఢిల్లీ టూర్ వెళ్లిన రేవంత్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ..ప్రభుత్వ పరంగా తీసుకొనే నిర్ణయాల పైన పార్టీ నేతలతో చర్చించనున్నారు. తెలంగాణ నుంచి సీనియర్ నేత కేకే రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికతో పాటుగా పెండింగ్ హామీల పైన రేవంత్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆదివారం ఈ సమావేశానికి నిర్ణయించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్దిగా పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్విని అధినాయకత్వం ఖరారు చేసింది. సీనియర్ నేత కేకే కాంగ్రెస్ లో చేరిన సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆ స్థానంలో కాంగ్రెస్ సింఘ్వీని ప్రకటించింది. ఢిల్లీ పర్యటనలో సింఘ్వీ తో రేవంత్ సమావేశం అయ్యారు. సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

CM Revanth meeting with Congress MLA s to discuss on Rajaysabha Elections

దిశా నిర్దేశం
ఈ ఎన్నిక పైన పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశంలో వివరించనున్నారు. అదే విధంగా రైతు రుణమాఫీ అమలు చేసిన విధానం గురించి ఎమ్మెల్యేలకు విశ్లేషించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేస్తున్న తీరు గురించి చెబుతారని సమాచారం. ఇక.. పెండింగ్ లో ఉన్న హామీల అమలు పైన రేవంత్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంి. త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. అదే విధంగా రైతుబంధు గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు.

అన్నీ అమలు చేస్తాం
ఇక, పీసీసీ చీఫ్ పదవి పైన పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే తన అభిప్రాయం చెప్పానని..హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీ నిర్ణయం ఏంటనేది రేవంత్ వెల్లడించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారిని కలుపుకు పోవాలని...వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలను దిశా నిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+