Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రమంత్రులతో రేవంత్ రెడ్డి టీం భేటీ: కీలక ప్రతిపాదనలు ఇవే

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులతో కలిసి పలువురు కేంద్రమంత్రులతో గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన నిధుల విడుదల సహా పెండింగ్ సమస్యలను కేంద్రమంత్రుల వద్ద ప్రస్తావించారు. మొదట కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై చర్చించారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల రాష్ట్రానికి ఏడు న‌వోద‌య విద్యాల‌యాలు కేటాయించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. అదే స‌మ‌యంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాల‌యం కూడా కేటాయించ‌లేద‌ని, కేంద్రియ విద్యాల‌యాల‌తో పాటు నవోద‌య పాఠ‌శాల‌లు లేని జిల్లాల‌కు వాటిని కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ కోరారు.

CM Revanth Reddy and a group of ministers met several Union Ministers in Delhi

డీమ్డ్ యూనివ‌ర్సిటీల ప్రకటనకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని, కానీ ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తితోనే డీమ్డ్ యూనివ‌ర్సిటీలను గుర్తిస్తున్న విషయాన్ని సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివ‌ర్సిటీ గుర్తింపున‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి విధిగా ఎన్ఓసీ తీసుకునేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.

అనంతరం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భేటీ అయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలాన్ని హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్ 765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని వివరించారు. మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందన్నారు.

అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఈ రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని కేంద్రమంత్రికి వివరించారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌​ను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy and a group of ministers met several Union Ministers in Delhi

హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల రహదారి జీఎంఆర్ సంస్థ పూర్తి చేయలేదని, అందుకే మరోసారి టెండర్ల పిలవడం గురించి కేంద్రమంత్రితో చర్చించినట్లు వెంకట్ రెడ్డి చెపపారు. పెండింగ్ రోడ్డు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. తెలంగాణ‌లో పెండింగ్‌​లోని 16 రోడ్లకు సంబంధించి రూ. 3200 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని.. త్వరలో వాటి డీపీఆర్​‌లు కేంద్రానికి ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

జనవరిలో రీజనల్ రింగ్ రోడ్డు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి రావాలని కేంద్రమంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రీజనల్ రింగ్ రోడ్డుకి టెక్నికల్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. డిసెంబర్ 20న ప్రాజెక్టు అప్రూవల్ కమిటీలో రీజనల్ రింగ్ రోడ్డు అనుమతులు ఇవ్వాలని కోరామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు కేంద్రమంత్రికి ఇచ్చామని, ఇందుకు అనుమతిస్తామని తెలిపారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సహా మంత్రులు కాంగ్రెస్ పెద్దను కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+