నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..!!
ముఖ్యమంత్రి రేవంత్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తిలో కేసు నమోదైంది. సీఆర్పీసీ (CrPC) సెక్షన్ 313 కింద నిందితుల వాంగ్మూలం నమోదు ప్రక్రియ కోసం ఆయన స్వయంగా కోర్టుకు వచ్చి విచారణకు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2021 ఏప్రిల్ 11న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘించారని కేసు నమోదు అయింది. పార్టీ నేతలతో కలిసి మాస్కులు లేకుండా ప్రచారం చేయటం పైనా అభ్యతరం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసారు. అందులో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 313 కింద నోటీసు ఇచ్చారు. దీంతో.. స్వయంగా హాజరై తన స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో.. రేవంత్ కోర్టుకు హాజరైన సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇక.. రేవంత్ అటు రాజకీయంగా.. ఇటు పాలనా పరంగా వేగం పెంచారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కీలక నిర్ణయాలకు సిద్దమైన రేవంత్
తాజాగా హైదరాబాద్ మాదాపుర్లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుని పోటీపడదామని, ఇప్పుడు మాత్రం అందరూ అభివృద్ధిలో కలిసి రావాలని కోరుతున్నానని సీఎం అన్నారు. హైటెక్ సిటీతో పాటు తమ్మిడికుంట గురించి మాట్లాడుకుంటారని తెలిపారు. ఐటీ నిపుణులు వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అని చెప్పుకునేలా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. తమ్మిడికుంటకు భద్రతతో పాటు అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. శిల్పులు చెక్కని శిల్పాలు ఎన్నో మన హైదరాబాద్ చుట్టూ ఉన్నాయన్న సీఎం, ఓఆర్ఆర్ లోపల 1372 చెరువుల్లో 50 శాతం కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్ల నివాసాన్ని మనం ఆక్రమిస్తే ఆ నీళ్లు మన జీవితాలను ఆక్రమిస్తున్నాయన్నాయని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
