మోదీ కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్ - తెలుగు రాష్ట్రాల నుంచి.. ఇన్ - అవుట్, లిస్టులో..!!
కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్దం అయ్యారు. ముహూర్తం సైతం ఖరారైంది. కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ మార్పులకు సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా కసరత్తు తుది దశకు చేరింది. మంత్రి పదవుల నుంచి తప్పించే వారి విషయంలో ఇప్పటి కే ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి మార్పులు జరగనున్నాయి.
ప్రధాని మోదీ ఈసారి మంత్రివర్గంలో భారీగానే మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 12 నుంచి 17 మంది కొత్తవారిని తీసుకోవాలని, కొందరు సీనియర్లను తప్పించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ చౌహాన్, నిర్మల, మనోహర్‌లాల్, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి తదితరులు ఒకటి కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్నారు. ఆ అదనపు శాఖలను కొత్తవారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 25,26 తేదీల్లో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఖాయమని సమాచారం. జెన్ జీ యూత్ ని ఆకట్టుకోవడం లో భాగంగా కేబినెట్ కి యూత్ అట్రాక్షన్ తీసుకుని రావడమే లక్ష్యంగా కీలక మార్పులకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

కీలక రాష్ట్రాల ఎన్నికల వేళ భారీ మార్పులు
ఇక, కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి కీలక మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ నుంచి టీడీపీ - జనసేన ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. జనసేనకు అవకాశం వస్తే వల్లభనేని బాలశౌరీ, టీడీపీ నుంచి ఛాన్స్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కాగా.. పెమ్మసాని చంద్రశేఖర్ కు కేబినెట్ మంత్రి గా ప్రమోషన్ దక్కనుంది. ఇక.. తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ప్రధాని మోదీ కేబినెట్ అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డీకే అరుణ, నగేష్, ఈటల రాజేందర్ లో ఇద్దరికి కొత్తగా మంత్రులుగా అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రుల లో ఒకరిని తప్పించి పార్టీ సేవలకు వినియోగిస్తారనే ప్రచారమూ ఢిల్లీలో వినిపిస్తోంది. దీంతో.. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన వేళ జరిగే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
