Revanth Reddy: చిరంజీవితో రేవంత్ రెడ్డి.. ఎక్కడంటే..!

మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషన్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి తనకు పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ లో విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా వచ్చారు. మెగాస్టార్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చిరంజీవికి అవార్డు ప్రటించగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిందే.

శనివారం ప్రత్యక్షం కలవడంతో మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. చిర అవార్డు రావడం తెలుగువారికి గర్వకారణమని రేవంత్ అన్నారు. రేవంత్ రామ్ చరణ్ తో కాసేపు ముచ్చటించారు. ఈ విందుకుశాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

CM Revanth Reddy attended the dinner hosted by Megastar Chiranjeevi

పద్మ అవార్డులు వచ్చిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించనుంది. శిల్పాకళా వేదికలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.పద్మవిభూషన్‌కు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి ఆహ్వానించారు. వెంకయ్యనాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో, చిరంజీవిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి రావాలని కోరారు.

వీరితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్‌లాల్, శిల్పకారుడు సత్తి ఆనందాచారిని ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+