Rajeev Ratan: ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన సీఎం..
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. రాజీవ్ రతన్ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖకు రాజీవ్ రతన్ అందించిన సేవలు మరవలేమని సీఎం అన్నారు. సుదీర్ఘ కాలం పోలీస్ విభాగంలో పని చేశారని గుర్తు చేశారు. ఆయన నిజాయితీగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. రాజీవ్ రతన్ ను తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు. రాజీవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రస్తుతం రాజీవ్ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం రాజీవ్ రతన్ తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజీవ్ రతన్ మేడిగడ్డ ప్రాజెక్టుపై ఇటీవల ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు హెడ్ గా వ్యవహరించారు.

రాజీవ్ రతన్ కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా, హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పలు హోదాల్లో పని చేశారు. మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్ బాస్ రేసులో రాజీవ్ రతన్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా పనిచేస్తున్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పోలీస్ శాఖ సంతాపం వ్యక్తం చేసింది.
సీనియర్ #IPS అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి @revanth_anumula దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను…
— Telangana CMO (@TelanganaCMO) April 9, 2024












Click it and Unblock the Notifications