గిగ్ వర్కర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల (Gig Workers) సంక్షేమం కోసం ప్రత్యేకంగా పాలసీ రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో అందుకు సంబంధించిన పాలసీపై చర్చించారు. కాగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అధికారులను పలు కీలక సూచనలు చేశారు.
ఈ మేరకు ప్రతిపాదిత పాలసీలో భాగంగా గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను కూడా వారికి కల్పించే విధంగా పాలసీ రూపకల్పన చేయాలని సూచించారు. గిగ్ కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆ బోర్డులో ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉండేలా చూడాలని చెప్పారు. గిగ్ వర్కర్ల పూర్తి డేటాను ఆన్‌లైన్‌లో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేసింది. కొమురం భీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జీవో 49ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోపై స్థానిక ఆదివాసీ ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జీవోను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
ఆదివాసీల అభిప్రాయాలను పరిశీలించే వరకు ఈ జీవోను అమలు చేయబోమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజలతో మరింత చర్చలు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ రెండు నిర్ణయాలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒకవైపు గిగ్ కార్మికుల సంక్షేమం, మరోవైపు ఆదివాసీ హక్కుల పరిరక్షణ పట్ల ప్రభుత్వ చర్యలను రాజకీయ, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు అభినందిస్తున్నాయి.
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు… pic.twitter.com/hqialx1vs3
— Telangana CMO (@TelanganaCMO) July 21, 2025












Click it and Unblock the Notifications