తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి టౌన్ లో..

తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కృషి చేస్తోంది. మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అతివలే లక్ష్యంగా ఇప్పటి వరకు పలు పథకాలు ప్రారంభించింది. ఇటీవల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి టౌన్ లో మహిళా మార్ట్ లు ఏర్పాటు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఖమ్మంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ దిగ్విజయంగా నడుస్తోందని తెలిపారు. ఇలాంటివి రాష్ట్రంలోని ప్రతి టౌన్ లో రావాలని ఆకాంక్షించారు.

ఖమ్మం జిల్లాలో ఇటీలల మహిళా మార్ట్ ప్రారంభమైంది. మహిళల స్వయం ఉపాధికి దోహదం చేసే విధంగా ఈ మార్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మార్ట్‌ లో స్థానికంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

CM Revanth Reddy Pushes for Women s Marts in Every Telangana Town

ప్రజా ప్రభుత్వ సంకల్పం... అధికారుల కార్యచరణ... ఆడబిడ్డల ఆచరణకు... ప్రతిరూపం ఖమ్మంలో... దిగ్విజయంగా నడుస్తోన్న... ఈ 'మహిళామార్ట్'.. ఇందులో భాగస్వాములైన...
ప్రతి ఒక్కరికి నా అభినందనలు. రాష్ట్రంలో... ప్రతి టౌన్ లో ఇటువంటి 'మహిళా మార్ట్' లు
ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నా.. అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+