Revanth Reddy: ఇది రాజకీయమంటే.. దెబ్బకు దెబ్బ కొట్టిన సీఎం రేవంత్..!
మనం చేసే ప్రతి పని కర్మ ఫలం అనుభవించాల్సే ఉంటుంది. అతి మంచి కావొచ్చు.. లేదా చెడు కావొచ్చు. అది ఏ రంగంలోనైనా కావొచ్చు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఈ కర్మ ఫలాలు వెనువెంటనే వస్తుంటాయి. తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం చేశారు. అదే రోజు బీఏసీ సమావేశమై ఎన్ని రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చించింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సభాపక్ష నేత కేసీఆర్, కడియం శ్రీహరి హాజరు కావాల్సి ఉంది. కానీ కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు సమావేశానికి వచ్చారు. దీంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ రావు, శ్రీధర్ బాబుకు మధ్య వాగ్వాదం జరిగింది.

అనారోగ్యంతో ఉన్నందున బీఏసీ సమావేశానికి రాలేనని కేసీఆర్ స్పీకర్ కు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ చెప్పింది. ఒకరికి బదులు మరొకరు రావడంపై తాము నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్ బాబు చెప్పారు. దీంతో హరీశ్ రావు బయటకు వచ్చారు. బీఆర్‌ఎస్ తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఇచ్చారని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అయితే ఒక సభ్యుడు సమావేశానికి రావడం లేదని చెప్పి అతడి స్థానంలో మరో ఎమ్మెల్యే వస్తే అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. స్పీకర్ అంగీకరించిన తర్వాతే తను వెళ్లినట్లు హరీశ్ రావు తెలిపారు.
తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఏసీకి పార్టీ పేరు ఇచ్చిన వారే రావాలన్నారు. అది రూల్ అని చెప్పారు.గతంలో టీడీపీ పార్టీ తన పేరు ఇచ్చినా.. తననే బీఏసీ నుంచి బయటికి పంపించారని రేవంత్ గుర్తు చేశారు.అప్పుడు ఒక్క ఎర్రబెల్లి కి అనుమతించి తనను బీఏసీ నుంచి బయటికి పంపారని.. అప్పుడు హరీశ్ రావు కూడా ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications