కేటీఆర్ జైలుకే; కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సలహా!

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.ఆనాడు పిసిసి అధ్యక్షులు గా పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని మాట ఇచ్చానన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు .

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు
కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పూర్తవుతాయని ఆనాడే చెప్పానని,ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నవంబర్ 30లోగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేస్తారన్నారు.

CM Revanth reddy targets kcr and ktr made sensational comments in praja vijayotsava sabha

బండి సంజయ్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఈ కరీంనగర్ గడ్డపై నుంచే సోనియమ్మ మాట ఇచ్చారని,ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు.కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంత త్యాగానికైనా సిద్దమవుతుందని సోనియమ్మ నిరూపించారన్నారు.
కరీంనగర్ నగర్ లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు ఏం ఒరిగింది? కరీంనగర్ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో ప్రశ్నించారా? జిల్లా అభివృద్ధికి చిల్లి గవ్వ తెచ్చారా..? రెండుసార్లు గెలిచిన బండి సంజయ్ ఏం చేశారంటూ ప్రశ్నించారు.

వేములవాడ అభివృద్ధి ఎందుకు చెయ్యలేదు?
అలా చేసి ఉంటే జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలేవా? అన్నారు. పదేళ్లలో 20లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. 100 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల లో ప్యాకేజీ 9 ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికులకు రూ.5లక్షల ప్రమాదబీమా అందిస్తున్నామన్నారు.

పది నెలల్లో 50వేల ఉద్యోగాలు
కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను మేం పది నెలల్లో చేసి చూపించామన్నారు. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. పదినెలల్లో మనల్ని దిగి పొమ్మంటున్నారన్నారు. రుణ మాఫీపై దుష్ప్రచారం చేసున్న మీరు సత్తా ఉంటే అసెంబ్లీకి రావాలని మా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతారన్నారు. పది నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చామని, లెక్క కట్టి చూపిస్తామన్నారు.

కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా?
ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో... మా పదినెలల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చకు పెడదాం రండి అన్నారు.పదేళ్లలో కేసీఆర్ ప్రాజెక్టుల కోసం 1లక్ష 23 వేల కోట్లు ఖర్చు చేశారని ఏ ప్రాజెక్టునైనా పూర్తిచేశారా.. అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ కోసం సేకరించిన భూముల్లో హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నారని,అన్ని లెక్కలు తీస్తామన్నారు.

పేదలకు ఒక చట్టం నీకో చట్టమా?
కొండపోచమ్మ సాగర్ కట్టింది కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్లేందుకేనని అన్నారు.బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోవద్దట అంటూ ఎద్దేవా చేశారు. పేదలకు ఒక చట్టం నీకో చట్టమా? అని ప్రశ్నించారు.వికారాబాద్ లో కొంత మంది రౌడీ మూకలను తయారు చేసి కలెక్టర్,అధికారులపై దాడి చేశారని పైగా కేసులు పెట్టారని అంటున్నారని అన్నారు.

కేటీఆర్ కుట్రకు ఊచలు లెక్కబెట్టాల్సిందే
నీ కొడుకు.. నీ అల్లుడు చేసింది సమర్థిస్తారా అంటూ కేసీఆర్.ను ప్రశ్నించారు.కొడంగల్ లో భూసేకరణ చేస్తే మీకు కడుపుమంట దేనికి? అన్నారు. కేటీఆర్ ఢిల్లీ కాదు చంద్రమండలం పోయి పిర్యాదు చేసుకున్నా సరే... చేసిన కుట్రకు నువ్వు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని అన్నారు. అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా.. చర్చిద్దాం అంటూ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+