CM Revanth Reddy: కొత్త గవర్నర్ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..!
తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియామకం అయిన సంగతి తెలిసిందే. కొత్త గవర్నర్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజల తరఫున కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని తెలిపారు."తెలంగాణ ప్రజల తరపున..శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారికి స్వాగతం
తెలంగాణ గవర్నర్ గా అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రానికి చెందిన వారు. ఆయన గతంలో త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యకిగా ఉన్నారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణను రాష్ట్రపతి మహారాష్ట్రకు బదిలీ చేసింది.

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో జిష్ణు దేవ్ వర్మ, రేవంత్ రెడ్డి సర్కార్ కు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనని చర్చలు కొనసాగుతోన్నాయి. అయితే గవర్నర్ సీపీ రాధాకృష్ణతో రేవంత్ రెడ్డి కాస్త సత్సంబంధాలు కొనసాగాయి. కాగా పలు రాష్ట్రాలకు సేవ చేసినందుకు గర్వపడుతున్నానని సీపీ రాధాకృష్ణ అన్నారు. దేశ సేవలో నా చివరి శ్వాస వరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నిన్నటి వరకు తెలంగాణ, జార్ఖండ్, పుదుచ్ఛేరి లకు గవర్నర్ గా పని చేసిన ఆయనను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.
On behalf of people of Telangana..
— Revanth Reddy (@revanth_anumula) July 28, 2024
I Welcome shri Jishnu Dev Varma garu
as the Governor of Telangana.
My best wishes for all future endeavours. https://t.co/0NoHsUIZk6
"మా ప్రియమైన అత్యంత గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, మన ప్రజానాయకుడు, మన ప్రియతమ అత్యంత గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారితో పాటు మన ప్రియమైన గౌరవనీయులైన హోం మంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications