Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాసి పెట్టుకోండి.. అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే, 2028లో కాదు- తేల్చేసిన రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2028 చివర్లో జరగాల్సి ఉంది. అయితే, షెడ్యూల్ మారుతుందని వెల్లడించారు. అదే విధంగా జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదని తేల్చి చెప్పారు. జిల్లాల ఏర్పాటు పైన చర్చ జరుగుతున్న వేళ రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. జైలుకు పోవటానికి బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారని... చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పైనా తన అభిప్రాయం తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాసి పెట్టుకోండి.. తెలంగాణ అసెంబ్లీకి నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం 2028 డిసెంబరు లో ఎన్నికలు రావాలి.. కానీ అప్పుడు కాకుండా 2029లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి...' అని తేల్చి చెప్పారు. పార్లమెంటుకు, దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకేసారి (జమిలీ) ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీ భావిస్తుండటమే దీనికి కారణమని వివరించారు. ఆ ప్రకారంగా 2029 లో పార్లమెంటు ఎన్నికలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్లను నిర్వహిస్తారని వివరించారు.

cm-revanth-says-state-assembly-elections-will-held-in-2029-instead-of-2028-as-one-nation-one-electio

2029 నాటికి జనగణనలో కులగణన, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, వాటి సంఖ్య పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు అనేవి బీజేపీ వ్యూహాలుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచుతామనటం సరికాదన్నారు. దీనివల్ల కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి, క్రమశిక్షణను నిరూపించుకున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగు తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జమిలి దిశగా కేంద్రం కసరత్తు

కాగా, యూపీ, బీహార్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి.. కేరళ, తమిళనాడు, కర్నా టక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని తెలిపారు. అందువల్ల వాటి సంఖ్యను పెంచి తే.. ఇప్పుడున్న ప్రకారంగా రాష్ట్రాల్లోని సీట్ల మధ్యనున్న గ్యాప్‌ను కొనసాగించాలని, అందుకను గుణంగా సర్దుబాట్లు చేయాలని సూచించారు. అలా చేయకపోతే పార్లమెంటులో బలం కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధార పడాల్సిన అవసరమే కేంద్రానికి ఉండబోదని హెచ్చరిం చారు. ఇదే జరిగితే నిధులు, గ్రాంట్లు, సహాయాల విషయం లో ఆయా రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోబోదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాల్లో దక్షిణాది పట్ల మోడీ సర్కార్‌ తీవ్ర వివక్షను చూపుతోందని విమర్శించారు. అయితే కేంద్రం నిధులిచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణలో మాత్రం అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. జైలు కు పోతే సీఎం అవుతామనే ఒక భావన సర్వత్రా వ్యాపించిందన్నారు. జైలుకు పోయిన జగన్‌, చంద్రబాబుతోపాటు తాను సీఎం అయ్యామని.. అందుకే ఇప్పుడు వాళ్లు (కేటీఆర్‌, హరీశ్‌రావు) కూడా జైలుకు పోవటానికి తహతహ లాడుతున్నారని రేవంత్ ఎద్దేవాచేశారు. 2026 జనవరి ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు దేశంలోని ఏ హద్దులూ (రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు వగైరా) మార్చటానికి వీల్లేదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని రేవంత్‌రెడ్డి వివరించారు. అందువల్ల ఇప్పటికిప్పుడు జిల్లాల పునర్విభజన ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+