ప్లాన్ మార్చిన రేవంత్, మంత్రులకు పిలుపు - కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహాల ను సిద్దం చేస్తున్నారు. అటు గులాబీ నేతలు సైతం సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ... సవాళ్లతో ముందుకు వెళ్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సమరానికి సిద్దం అవుతున్న వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. కీలక నిర్ణయాల దిశగా సిద్దమయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా కార్యాచరణ తో సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఆరోపణలు - ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. కాగా.. బీఆర్ఎస్ చేస్తున్న 22 ఏ భూమల వివాదం పైనా రేవంత్ ప్లాన్ మార్చారు.
22 ఏ భూముల వివాదంలో గులాబీ నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సీఎంతో పాటు గా మంత్రి పొంగులేటి పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో.. ఈ అంశం పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి నిర్ణయించారు. అసెంబ్లీ వేదికగానే బీఆర్ఎస్ ఆరోపణలకు సమాధానం చెప్పాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ముందుగా మంత్రులతో భేటీ అవుతున్నారు.

అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్ లక్ష్యంగా
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 22A నిషిద్ధ భూముల ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో ఈ భేటీ జరగనుంది. బుధవారం అసెంబ్లీలో 22A భూముల ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలు, అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ కు ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఈ వివాదం మొదలైందనే అధారాలను సభలో ప్రవేశ పెట్టి... బీఆర్ఎస్ నేతలు ఈ తరహా నిషేధం ద్వారా భూములను సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన సభలోనే చర్చించి.. అన్ని అంశాలను బయట పెట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అటు బీఆర్ఎస్ సైతం ఇందుకు కౌంటర్ గా తమ ప్లాన్ తో సిద్దం అవుతోంది.













Click it and Unblock the Notifications
