Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ Vs కేటీఆర్, నామినేటెడ్ సీఎం - కౌంట్ డౌన్ బిగిన్..డైలాగ్ వార్..!!

తెలంగాణ అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ వర్సస్ సీఎం రేవంత్, మంత్రుల మధ్య డైలాగ్ వార్ సాగింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అంతా త‌ప్పుల త‌డ‌క‌గా ఉంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ నామినేటెడ్ సీఎం అని వ్యాఖ్యానించారు. ఎన్నారైలకు ఏమీ తెలియదంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నారైలంటే కాంగ్రెస్ సీఎంకు ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టం అవుతుందని కేటీఆర్ కౌంటర్ చేసారు.

అసెంబ్లీలో డైలాగ్ వార్ : శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ లో డైలాగ్ వార్ కొనసాగింది. ఇంత దారుణ‌మైన ప్ర‌సంగం రాష్ట్ర శాస‌న‌స‌భ చ‌రిత్ర‌లో వినలేదన్నారు. నాడు సోనియా గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను సభలో కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ హాయం గురించి వివరించారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో వివరిస్తూ విమర్శలు చేసారు.

CM Revanth Vs KTR Dialouge War in Assembly over Reply to Governor speech

కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని..వాటికి మార్చి 17 నుంచి అమల్లోకి తేవాల్సి ఉంటుందని గుర్తు చేసారు. హామీలు అమలు చేస్తే పూర్తిగా సహకరిస్తామని..లేకుంటే నిలదీస్తామని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐ‌లకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తాం అంటే సరికాదన్నారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు.

రేవంత్ వర్సస్ కేటీఆర్ : కేసీఆర్ కు కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాల గురించి రేవంత్ వివరించారు. దీనికి హరీష్ స్పందించారు. నాడు తమ కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణ కామన్ మినిమం అజెండాలో చేర్చిన తరువాతనే కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారని గుర్తు చేసారు. తాము నాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే సమయంలో చెప్పిన ఆరు కారణాలను హరీష్ వివరించారు.

ఇదే సమయంలో మంత్రులు జోక్యం చేసుకొని గత పదేళ్ల కాలంలో జరిగినవి మాట్లాడాలని సూచించారు. తిరిగి మాట్లాడిన కేటీఆర్ తెలంగాణను తెచ్చిన వ్యక్తిని ఏకవచనంతో సీఎం మాట్లాడారని.. ఈ పదేళ్లలో మా ప్రాణం పణంగా పెట్టి పని చేశామన్నారు కేటీఆర్‌. మా పదేళ్ల పాలనలో పాలమూరులో వలసలు బంద్‌ అయ్యాయని గుర్తు చేశారాయన. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.

https://telugu.oneindia.com/sports/ind-vs-sa-mohammed-shami-out-of-tests-and-deepak-chahar-from-odi-series-bcci-announced-367679.html

నామినేటెడ్ సీఎం : ఎన్నారైలకు టిక్కెట్ అమ్ముకున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారాయన. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని.. ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్నారై అని సీఎం రేవంత్ కామెంట్ చేశారని.. పార్టీ అధ్యక్షురాలిని విదేశాల నుంచి తెచ్చుకున్నది ఏ పార్టీయే చెప్పాలని నిలదీశారు.

మొదటి క్యాబినెట్‌లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు..ఇప్పటివరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు..ఫలితాల గురించి కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలోని ప్రతి హామిని నిలబెట్టుకోవాలని.. కచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరాలని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+