ఇకపై వారికి కూడా ఫ్రీ బస్సు.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ఒకటి. ఈ నిర్ణయం మహిళా సాధికారతను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించింది. 2023 డిసెంబర్ 9 న ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు, విద్యార్థినులు, రోజూవారీ కూలీలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. బస్సు ఛార్జీల కోసం మహిళలు నెలకు దాదాపు రూ. 1500 నుంచి రూ. 2వేల వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తం వారికి ఆదా అవుతోంది. ఈ పథకానికి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్రీ బస్సు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నామని అన్నారు. పిల్లల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ప్రతి తరగతిలో కనీసం 30 మంది విద్యార్థులు ఉండే విధంగా రేషనలైజ్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల కోసం ట్యూటర్లను సమకూరుస్తామని తాజాగా ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐ బ్లూ కాలర్ జాబ్స్ ను రీప్లేస్ చేయలేదని అందుకే నైపుణ్యాల కోసం స్కిల్స్ వర్సిటీని పెట్టామని తెలిపారు.
ఇక టీజీఎస్ఆర్టీసీ కి చెందిన పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్ నగరం పరిధిలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఉచిత ప్రయాణం ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరోవైపు ఇటీవల మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను జారీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ కార్డు ముందు భాగంలో లబ్ధిదారురాలి ఫోటో, పేరు, జిల్లా వివరాలతో పాటు 16 అంకెల ప్రత్యేక యూఐడీ నెంబర్ కూడా ఉంటుంది. ఇక ఇప్పటివరకూ దాదాపు 290 కోట్లకు పైగా ఉచిత జీరో టికెట్లను టీజీఎస్ఆర్టీసీ మహిళలకు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇక బస్సుల్లో గతంలో మహిళల ప్రయాణం 40 శాతం ఉండగా ప్రస్తుతం అది 67 శాతానికి పైగా పెరిగింది.












Click it and Unblock the Notifications