యాదాద్రి అత్యద్భుతం: వచ్చే దసరా నాటికి సిద్ధం(పిక్చర్స్)

హైదరాబాద్: వచ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుత శిల్ప కళా రూపాలతో దైవభక్తి ఉట్టిపడే తీరులో తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేవస్థానం అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆయన బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ సీఈవో కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, బడే రవికిరణ్, ఈవో గీతారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆమోద ముద్ర

ఆమోద ముద్ర

ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణ కౌశలంతో శిల్పకళా నైపుణ్యంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు.

సమీక్ష సమావేశం

సమీక్ష సమావేశం

ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, కాటేజీలకు సంబంధించిన త్రీడి వీడియో చిత్రాలను పరిశీలించారు. త్రీడీ నమూనాలపై సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు.

 కెసిఆర్‌తో ఆనంద్ సాయి

కెసిఆర్‌తో ఆనంద్ సాయి

ఐదు రాజగోపురాలతో పాటు ప్రాకార మండలాలు పూర్తిగా శిలతో నిర్మితమవుతున్న తొలి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

హనుమంతుని విగ్రహం

హనుమంతుని విగ్రహం

కృష్ణ శిలతో జరిగే నిర్మాణాలు అందరినీ ఆకర్షిస్తాయన్నారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు యాదాద్రిలో ఇప్పటికే శిల్పాలు చెక్కడం, తదితర నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.

పరిశీలనగా కెసిఆర్

పరిశీలనగా కెసిఆర్

యాదాద్రిలో భక్తుల బసతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, సీఎం వంటి ప్రముఖుల కోసం చేపట్టిన కాటేజీల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

కాటేజీలపై ప్రత్యేక శ్రద్ద

కాటేజీలపై ప్రత్యేక శ్రద్ద

దైవ సన్నిధిలో నిర్మించనున్న ఈ కాటేజీల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేసి ఆమోదం తెలిపారు. ప్రకృతి రమణీయతతో పాటు అడుగడుగునా దైవసన్నిధిలో సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు

యాదాద్రి ఆలయం

యాదాద్రి ఆలయం


ఆగమశాస్త్ర సూత్రాలకు అనుగుణంగానే యాదాద్రి దేవాలయానికి ప్రాణప్రతిష్ఠ జరగాలన్నారు. పచ్చదనంతో యాదాద్రిపై ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు దిగ్రీల వరకు తగ్గుతుందని చెప్పారు.

ఆలయ నమూనా

ఆలయ నమూనా


యాదాద్రి వద్ద 250 ఎకరాల్లో వసతిగృహాల సముదాయాల నిర్మాణాలకు కార్పొరేటు సంస్థలు ముందుకొచ్చినందున వాటి నిర్మాణాలు వేగంగా సాగుతాయని తెలిపారు.

కాంతీలీనుతున్న యాదాద్రి

కాంతీలీనుతున్న యాదాద్రి

యాదాద్రి క్షేత్రపాలకుడిగా నిత్య పూజలందుకుంటున్న ఆంజనేయ స్వామి పాలరాతి విగ్రహాన్ని 108 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. బుధవారం తన నివాసానికి తీసుకొచ్చిన ఆ విగ్రహ నమూనాను పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

క్షేత్ర నమూనా

క్షేత్ర నమూనా

ఈ విగ్రహ రూపకల్పనకు చైనా శిల్పులు ముందుకు వచ్చారు. ఆ విగ్రహ నిర్మాణానికి ‘యాడా' అర్కిటెక్ట్‌ ఆనందసాయి, దేవాలయ కమిటీ సభ్యులు త్వరలోనే చైనాను సందర్శించనున్నారు.

యాదాద్రి అత్యద్భుతం

యాదాద్రి అత్యద్భుతం

పూర్తిస్థాయి నిర్మాణాల అనంతరం యాదాద్రి గుట్టపైన వెల్లివిరియనున్న పచ్చదనం తదితర ప్రకృతి రమణీయ సుందర నిర్మాణాలతో ఆలయ పరిసరాల ఉష్ణోగ్రత నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సుమారు 250 ఎకరాల్లో నిర్మితం కానున్న వసతి గృహాల సముదాయాల నిర్మాణానికి ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాణ ప్రతిష్ట

ప్రాణ ప్రతిష్ట

ఆగమశాస్త్ర సూత్రాలను తూచా తప్పకుండా తంజావూరు వంటి వేల సంవత్సరాల కిందటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణప్రతిష్ఠ పోయనున్నదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+