మీ ఆరోగ్యం జాగ్రత్త, నా ప్రయత్నం చేస్తా: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: బాసర ఐఐఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జియూకేటీ విద్యార్థి చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల తాను ఆందోళనకు గురవుతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గవర్నర్ కోరారు. వర్షంలోనూ తడుస్తూ విద్యార్థులు పోరాటం చేయడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తన ట్వీట్‌ను తెలంగాణసీఎంఓకు జత చేశారు.

ఆందోళన కొనసాగిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడో రోజు కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. నిన్న వర్షంలో.. ఈరోజు ఎండలోనూ విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన తగ్గేదేలే అని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు.
I am concerned on seeing you all agitating even in rains.Please take care of your health to fullfill your parent's dreams & your goals.with best of my efforts i will convey your grievances to the concerned authorities for redressel @TelanganaCMO
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) June 16, 2022
విద్యార్థులు, వారికి మద్దతుగా వారి తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మూడ్రోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది.ఈ క్రమంలో కాస్త దిగొచ్చిన సర్కార్ బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్‌ను నియమించింది. ఆయన విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చింది.
అయినా, వెనక్కి తగ్గిన విద్యార్థులు డైరెక్టర్ నియామకంతో తమ సమస్యలు పరిష్కారం కావని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ వద్దకు వస్తే తప్ప ఆందోళన విరమించమని తేల్చి చెబుతున్నారు.
కాగా, విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వచ్చిన వారి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులవి సిల్లీ డిమాండ్ అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసినట్లు వచ్చిన వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కలెక్టర్ భరోసా కల్పించినా.. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు విద్యార్థులు. మూడు రోజులుగా 8వేల మంది విద్యార్థులు ఆందోళన చుస్తుంటే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రధానమైన 12 సమస్యలను పరిష్కరించాకే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మూడు రోజులుగా విద్యార్థులు ఎండా వానలు లెక్కచేయకుండా ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications