దళిత సీఎం వ్యాఖ్యలపై కేసీఆర్ సంచలనం-కొత్త రాష్ట్రాన్ని వారు నడిపించలేరు..!
తెలంగాణ ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బీజేపీ అగ్ర నాయకత్వం ప్రచారంలోకి దిగింది. ఈ సమయంలో నే కేసీఆర్ ఇచ్చిన హామీలు..అమలు చేయకపోవటం పైన కాంగ్రెస్ నిలదీస్తోంది. తాజాగా కేసీఆర్ 2014లో తాను దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన విషయం పైన నిలదీస్తోంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా..అంత మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం చేయకపోవటం అవమానించటమేనని టార్గెట్ చేస్తోంది.
టార్గెట్ కేసీఆర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తమకు అనుకూలంగా ఉన్నాయని..ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ దీమాతో ఉంది. అందులో భాగంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ఇండియా టుడే ఇంటర్వ్యూ చేసింది. ఇందులో కేసీఆర్ ఈసారి ఎన్నికలలో 2018 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువగా, 95-100 సీట్లు సాధించి, హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దళిత సీఎం హామీ అమలు కాకపోవటం గురించి వచ్చిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పైన ఇప్పుడు కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

ఎందుకు అమలు చేయలేదు : కేసీఆర్ నాడు 2014లో గెలిచిన తరువాత అప్పుడు నెలకొన్న పరిస్థితులు...కొత్త రాష్ట్రానికి తానే నాయకత్వం వహించాలనే ఒత్తిడితో సీఎం అయినట్లు చెప్పారని..మరి ఆ తరువాత ఎందుకు దళితుడిని సీఎం చేయలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 2014లో 63 సీట్లతో గెలిచిన బీఆర్ఎస్..2018 ఎన్నికల్లో 88 సీట్లతో అధికారంలోకి వచ్చిన అంశాన్ని గుర్తు చేసింది. అప్పటికీ దళితుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ కు మనసు రాలాదే అని నిలదీసింది. చెప్పిన హామీ నిలబెట్టుకోనుందుకు ఇప్పటి వరకు కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత మంది దళిత నేతలు ఉంటే వారిలో ఎవరికీ పాలనా సామర్ధ్యం లేదనేది కేసీఆర్ ఆలోచనా అంటూ నిలదీస్తోంది.

కాంగ్రెస్ తోనే సాధ్యం : ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దళిత నేత దామోదరం సంజీవయ్యను సీఎం చేసిన అంశాన్ని గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా దళితులు అందరూ ఏ పార్టీ వారి సంక్షేమం..ఉన్నతి కోసం కట్టుబడి ఉందో గుర్తించాలని పిలుపునిచ్చింది. రాజకీయంగా ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహం అమలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారంలో బీఆర్ఎస్ లక్ష్యంగా మరింత పదును పెంచారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు సైతం హైదరాబాద్ లోనే మకాం వేసి పార్టీ ప్రచారం..ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలను సమీక్షిస్తున్నారు.
కేసీఆర్ గారు..
— Telangana Congress (@INCTelangana) November 18, 2023
ఇండియా టుడే మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దళిత ముఖ్యమంత్రి గురించి మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయా?
మీ స్కాంలు, కమీషన్ల హడావుడిలో పడి మీరు మర్చిపోయినా.. మేం మర్చిపోలేదు.
అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నాం...
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని… pic.twitter.com/7oS4fqSUTq












Click it and Unblock the Notifications