కేటీఆర్ పై చర్యలు తీసుకోండి: సీఈసీ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నేత టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ తన ఫిర్యాదులో ఓటర్లను ప్రభావితం చేసేలా బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవర్తించారని, కచ్చితంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసి, సైలెంట్ పీరియడ్ కొనసాగుతున్న తరుణంలో ఎటువంటి పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ, కేటీఆర్ ఆ నిబంధనలను తుంగలో తొక్కి తెలంగాణ భవన్లో దీక్ష దివస్ ను నిర్వహించారన్నారు.

 Congress complains to CEC Vikas Raj to Take action on KTR

కేటీఆర్ రక్తదానం కార్యక్రమాన్ని చేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంతో చేశారని, ఆ రోజులను మళ్లీ గుర్తు చేసుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజున దీక్ష దివస్ గా బిఆర్ ఎస్ పార్టీ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతున్న తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసేలాగా కార్యకలాపాలు నిర్వహించారని, బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీసులో కార్యక్రమాన్ని నిర్వహించి, రక్తదానం చేసి, కేటీఆర్ మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల అధికారికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపిన ఆయన వెంటనే కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెల్లవారితే ఎన్నికలు జరుగుతాయి అనగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+