ఫలితాల్లో అంచనాలు తారు మారు, కంచుకోటల్లో మారుతున్న లెక్కలు..!!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల పై స్పష్టత వచ్చింది. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నిక ల సమరంలో ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగానే ఫలితాలు వస్తున్నాయి. మెజార్టీ మున్సిపాల్టీ, కార్పోరేషన్లలో అధికార కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. అదే విధంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. అయితే, కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీల అంచనాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో తప్పాయి. పార్టీల కంచుకోటల్లో లెక్కలు మారుతున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అన్ని జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటికే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.

congress-is-set-to-sweep-the-municipal-elections-in-telangana-and-it-has-secured-54-municipalities

ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. కొత్తగూడెం సీపీఐ సొంతం చేసుకుంది.

మారుతున్న లెక్కలు

కాగా, సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కొడంగల్‌, మధిర మున్సిపాలిటీలను కాంగ్రెస్​ దక్కించుకుంది. మొత్తం ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు ఉండగా 5 కాంగ్రెస్ ఖాతాలో జమ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఒక కార్పోరేషన్ బీజేపీకి దక్కనుంది. అదే విధంగా మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ 90 కి పైగా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బీఆర్ఎస్ 12, బీజేపీ ఒక్క స్థానానికే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే.. అధికార పార్టీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని అంచనా వేసినా... బీఆర్ఎస్, బీజేపీ ఇలా సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వటం ఆ పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఇక.. హంగ్ ఏర్పడిన 12 మున్సిపాల్టీల్లో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎంపీలు ఉన్న చోట... బీఆర్ఎస్ కంచుకోటల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో.. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+