బతుకమ్మ చీరెల పంపిణీలో కమీషన్లకు కక్కుర్తి: షబ్బీర్ అలీ
కరీంనగర్: బతుకమ్మ చీరల పంపిణీలో టిఆర్ఎస్ నేతలు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో షబ్బీర్‌అలీ పాల్గొన్నారు.
సిరిసిల్ల వస్త్రాలంటూ సూరత్ నుంచి తెప్పించి కమీషన్లు దండుకొన్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. రూ.50ల విలువచేసే చీరలు తెచ్చి రూ.200 అంటూ మోసం చేశారని విమర్శలు చేశారు.

రంజాన్‌లో జకాత్, బతుకమ్మలో చీరలు, క్రిస్మస్‌లో కేకులూ ఎవరూ అడగలేదని షబ్బీర్ అలీ చెప్పారు. ముస్లింలకు న్యాయం చేయాలనుకుంటే 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి కాపాడిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications