వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలకలం: భువనగిరిలో విజయశాంతి మేనేజర్ కిడ్నాప్..
భువనగిరి: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి మేనేజర్ సైదాచారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొంతకాలంగా ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారని, దాని కారణంగానే కిడ్నాప్ జరిగి ఉంటుందని చెబుతున్నారు. రూ.50లక్షలు ఇస్తేనే సైదాచారిని విడిచిపెడుతామని దుండగులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే గతంలో సైదాచారి ఓ మహిళ వద్ద అప్పు తీసుకున్నారని, ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతోనే ఈ కిడ్నాప్ చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. సైదాచారి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 8మంది దుండగులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!