కాంగ్రెస్ నేతలు టూరిస్టులు.!వారి విమర్శల్లో నైతికత లేదన్న కల్వకుంట్ల కవిత.!
హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. టూరిస్టులు అంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ పై కవిత ట్వీట్ రూపంలో మందలించే ప్రయత్నం చేసారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని ట్వీట్ ద్వారా విమర్శించారు. సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మోడల్ ని ఏ పార్టీ కూడా విమర్శించే నైతికత లేదని కవిత ఉద్ఘాటించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడితో పాటు "టూరిస్టులు" కూడా ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదని హితవు పలికారు. టూరిస్టులు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలుగా కవిత ట్వీట్ లో అభివర్ణించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడాది మొత్తంలో 600 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేదని, 2014 నుంచి ఇప్పటి వరకు 12 వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాము కాబట్టి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నామని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి అప్పుడప్పుడూ టూరిస్టుల్లాగా వచ్చే కాంగ్రెస్ నేతల మాటలు తెలంగాణ ప్రజలు అస్సలు పట్టించుకోకూడదన్నారు కవిత. కవిత చేసిన ఘాటు వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications