దిగ్విజయ్ తో ఎమ్మెల్యే సీతక్క భేటీ - నో కాంప్రమైజ్..!!
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పార్టీ ముఖ్య నేత దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల పై పార్టీ నేతలో దిగ్విజయ్ ఆరా తీస్తున్నారు. సీనియర్లు వర్సస్ రేవంత్ టీం అన్నట్లుగా టీపీసీసీలో పరిస్థితులు మారాయి. సీనయర్లు రేవంత్ లక్ష్యంగా వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. నేతల నుంచి సమాచారం సేకరిస్తున్న దిగ్విజయ్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయటం లేదు. తాను నియోజకవర్గంలోనే ఉంటానని.. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. ఇక, ఇదే సమయంలో సీతక్క పార్టీలో పరిస్థితులు..పార్టీ పదవుల విషయంలో తన నిర్ణయం స్పష్టం చేసారు.

రాజీనామా వెనక్కి తీసుకోలేదు..
ఎమ్మెల్యే సీతక్క తన రాజీనామా వెనక్కు తీసుకొనేది లేదని స్పష్టం చేసారు. అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందని దిగ్విజయ్ నేరుగా ప్రశ్నించారు. దీనికి చోటు చేసుకున్న పరిణామాలను సీతక్క వివరించారు. తెలంగాణలో ఈ విభేదాల పైన దిగ్విజయ్ ఆరా తీసారు. సమస్యల పరిష్కారాలపైన చర్చ జరిగినట్లు సీతక్క వెల్లడించారు. దిగ్విజయ్ కు తాను రాజీనామా వెనక్కు తీసుకోలేనని వెల్లడించినట్లు తెలుస్తోంది. తనను కొందరు సీనియర్లు వలసవాదులు అన్నందుకే హర్ట్ అయ్యానని సీతక్క చెప్పారు. దిగ్విజయ్ రాక..చర్చలతో అంతా మంచి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. పార్టీలో తమను వలస వాదులు అంటున్న నేతలు.. బయటకు పోతున్న వారిని ఎందుకు నిలువరించలేక పోతున్నారని సీతక్క ప్రశ్నించారు.
తన మనసులో ఏం లేదంటూ క్లారిటీ..
తమను వలస వాదులు అన్నందుకు బాధ పడ్డామని..తమ మనసులో ఏం లేదని సీతక్క స్పష్టం చేసారు. తాను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ..సంతోషంగానే ఉన్నానని చెప్పారు. రేవంత్ మనిషిగా తన మీద ముద్ర వేస్తున్నారని వాపోయారు. సీఎల్పీ నేతగా భట్టి చెప్పిన పని ఎప్పుడైనా పార్టీలో చేయలేదా అని ప్రశ్నించారు. తమను వలసవాదులుగా ముద్ర వేస్తున్న వారు కూడా గతంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వారనేని సీతక్క వ్యాఖ్యానించారు. తాము పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్ లో తాను ఇష్టంగా పని చేస్తున్నానని సీతక్క స్పష్టం చేసారు. అందరు కలిసి పని చేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు.

దిగ్విజయ్ వరుస సమావేశాలు..
గాంధీ భవన్ వేదికగా పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమన్వయం ఎక్కడ దెబ్బ తింటుందని ప్రశ్నిస్తున్నారు. నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. రేవంత్ పైన జగ్గారెడ్డితో సహా మరి కొందరు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ పదవుల వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాల పైన దిగ్విజయ్ నేతల నుంచి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లు..వలసవాదుల వాదన ఎందుకు వచ్చిందని దిగ్విజయ్ నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. నేతలతో వరుస సమావేశాల తరువాత రేపు పార్టీ ముఖ్య నేతలతో దిగ్విజయ్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పరిస్థితుల పైన పార్టీ చీఫ్ కు నివేదిక ఇవ్వనున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications