కౌంటర్: అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు కాంగ్రెస్ యోచన? కారణమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన తీవ్ర విమర్శలు అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం చూపేలా కన్సిస్తున్నాయి.

దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అని తిట్టిన తర్వాత కూడ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు ఎమ్మెల్సీ పొంంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. శుక్రవారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Congress MLC Ponguleti Sudhakhar reddy slams Cm Kcr

కేవలం కాంగ్రెస్ ను తిట్టేందుకే వరంగల్ లో కాంగ్రెస్ ను తిట్టేందుకు పెట్టినట్టు ఉందని పొంగులేలి చెప్పారు. టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, వాగ్ధానాల అమలు విషయాలను చెబుతామని ఆశించామని కాని, అందుకు విరుద్దంగా జరిగిందన్నారాయన.

కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు తిట్టేందుకు ఈ సభను ముఖ్యమంత్రి వినియోగించుకొన్నారని చెప్పారు. సంస్కృతి గురించి మాట్లాడే కెసిఆర్ సన్నాసులు, దద్దమ్మల భాషను ఎంచుకొన్నారని ఆయన మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MLC Ponguleti Sudhakhar reddy slams Cm Kcr on Friday. We are thinking expel special assembly session he said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి