ఈవీఎంలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం...ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
Recommended Video

తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం కష్టపడుతోంది. ఇప్పటికే ఓటింగ్‌కు కావాల్సిన పరికరాలు, సిరాలాంటి వాటికోసం ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. అయితే ఓటింగ్‌కు ఏర్పాటు చేసిన ఈవీఎంలపై మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యంతరం తెలిపింది..? దీని వెనక కారణం ఏమిటి..?

90 లక్షల బ్యాలట్ పేపర్లు ఆర్డర్ ఇచ్చిన ఈసీ
ఓటింగ్‌కు ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లు వినియోగించేవాళ్లు. టెక్నాలజీ పెరిగిపోవడంతో బ్యాలెట్ స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం. ఇక అప్పటి నుంచి ఏ ఎన్నికలైనా ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఇక వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు వారాల క్రితమే 90 లక్షల ఈవీఎంల కోసం 90 లక్షల బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ పేపర్లను గులాబీ రంగులో ప్రింట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ స్లిప్పులను ఈవీఎంలపై అంటిస్తారు. వీటిపై ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థుల గుర్తు, అభ్యర్థుల పేరు ఉంటుంది. ఇక్కడే కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.

గులాబీ రంగు టీఆర్ఎస్‌ను సూచిస్తుంది
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులో ఉండటంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా గులాబీ రంగు పేపర్లు ఈవీఎంలపై అంటించడాన్ని తప్పుబట్టింది. గులాబీ రంగు ముందునుంచి టీఆర్ఎస్ రంగు ఉందని ఇది చూసి ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందంటూ తమ వాదన వినిపించింది. ఇలా చేస్తే ఎన్నికల సంఘం పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించడంలేదని భావించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది. గులాబీ రంగు అంటే టీఆర్ఎస్ అని ప్రతి ఒక్కరికి తెలుసునని ఓటు వేసే సమయంలో ఈ రంగును చూసి మనసు మార్చుకుని టీఆర్ఎస్‌కు ఓటే వేసే అవకాశం ఉందని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.

పార్టీ గుర్తులుకన్నా రంగు ప్రభావితం చూపుతుంది
ఎన్నికల సంఘం మహిళల కోసం ముందుగా గులాబీ రంగుతో ఉన్న పోలింగ్ బూతులను పెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చిందని అయితే కాంగ్రెస్ పార్టీ ఇందుకు ఒప్పుకోలేదని శ్రవణ్ గుర్తు చేశారు. ఇప్పుడు గులాబీ రంగుతో కూడిన బ్యాలట్ పేపర్లు ఈవీఎంల పై అంటిచడం సరికాదన్నారు. అయితే ఇప్పటికే ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చేశామని ఈసీ చెప్పడం తమకు ఆమోదయోగ్యం కాదని శ్రవణ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే దీనిపై ఇతర పార్టీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంది.
చాలా రాజకీయ పార్టీలు వాటికి కేటాయించిన గుర్తుకంటే రంగుతోనే ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు కాషాయం రంగు బీజేపీని సూచిస్తుండగా... ఎరుపు వామపక్షాలకు గుర్తు. నీలం రంగు బహుజన్ సమాజ్ వాదీ పార్టీని సూచిస్తుండగా అన్నాడీఎంకేకు ఆకుపచ్చ రంగు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి పసుపు రంగు సూచిస్తుంది. ఇక గులాబీ రంగులో ఎలాంటి బ్యానర్, పోస్టర్ కనిపించినా అది టీఆర్ఎస్ పార్టీకి చెందినట్లుగానే ప్రజలు భావిస్తారని కాంగ్రెస్ ఈసీ దృష్టికి తీసుకొచ్చింది.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications