Telangana Results: పంచాయతీల్లో కాంగ్రెస్ దూకుడు-రెండో దశలోనూ..!
తెలంగాణలో జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ముగియంతో ఓట్ల లెక్కింపు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో దశలోనూ బీఆర్ఎస్ రెండో స్ధానంలోనూ, బీజేపీ నమూడో స్ధానంలోనూ కొనసాగుతున్నాయి. ఇతరులు కూడా పలు చోట్ల ఈ రెండు పార్టీల కంటే ముందున్నారు.
తెలంగాణ రెండో దశ పంచాయతీ పోరులో మొత్తం 4332 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో మధ్యాహ్నం నుంచి ఫలితాల లెక్కింపు మొదలైంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ తాజా వార్తలు అందేసరికి 1000 సీట్లకు పైగా సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. 400సీట్లకు పైగా సాధించి బీఆర్ఎస్ రెండో స్ధానంలో నిలిచింది. బీజేపీ 100సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇతరులు 300 పైచిలుకు సీట్లలో గెలుపొందారు.

జిల్లాల వారీగా చూసుకుంటే మెదక్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. అలాగే నిర్మల్ లో బీజేపీ .. కాంగ్రెస్ కు పోటీ ఇస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. పలు చోట్ల విజయాలు కూడా నమోదు చేసుకున్నారు. బీజేపీ కేవలం ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్ లో ఖాతా తెరిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం అన్ని జిల్లాల్లోనూ బోణీ కొట్టాయి.రెండో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 508 మంది అభ్యర్ధులకు మద్దతు ఇస్తోంది. అలాగే బీఆర్ఎస్ 158 మందికి, బీజేపీ 45 మందికీ మద్దతుగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications