మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ: పీసీసీ చీఫ్ నిర్ణయాలపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కీలక భేటీ నిర్వహించారు. తార్నాకలోని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో జరిగిన భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, కోదండరెడ్డి జగ్గారెడ్డి, కమలాకర్ రావు, జీ నిరంజన్, శ్యామ్ మోహన్ తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.
కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు. తాజా భేటీలో దాదాపు 14 మంది సీనియర్ నేతలు సమావేశమైనట్లు తెలిసింది.

ఏఐసీసీలో జరుగుతున్న తాజా పరిణామాలతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేగాక, ఆదివారం సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలపడంతోపాటు పీసీసీ నిర్ణయాలు, కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ముందుకెళ్తున్నట్లు భావిస్తున్న వీరంతా పీసీసీకి తగిన రీతిలో సలహాలు, సూచనలు చేయాలా? లేదంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా అనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఈ నేతలు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications