కాంగ్రెస్ కీలక నేత పై వేటు- మీనాక్షి ఎంట్రీతో..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం వేళ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీటి పైన కాంగ్రెస్ నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రతిపక్షం ఈ వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావన చేసింది. ఈ పరిణామాల పైన పార్టీ క్రమశిక్షణా సంఘం వివరణ కోరింది. ఇక, తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇస్తూనే కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ ఊహించని నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి సస్పెం డ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

Congress Supends Teenmar Mallanna from the party due to violation of Discipline

ఫిబ్రవరి 12లోపు వివర ణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి పేరట ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదనని స్పష్టం చేసారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వాఖ్యల ను పార్టీ ముఖ్య నేతలు తప్పు బట్టారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు తీన్మార్ మల్లన్న వ్యవహారం లో పార్టీ తీసుకున్న నిర్ణయం పైన ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+