హైదరాబాద్‌కు బీజేపీ నేతల హత్య కుట్ర నిందితుడు, భారత్ పంపిన సౌదీ

సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరుడిని అరెస్టు చేసారు. అతనిని హైదరాబాద్ తరలించారు. అతని పేరు సయ్యద్ జకీర్ రహీమ్.

హైదరాబాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరుడిని అరెస్టు చేసారు. అతనిని హైదరాబాద్ తరలించారు. అతని పేరు సయ్యద్ జకీర్ రహీమ్. ఇతను పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీకి బంధువు.

భారత్ తరలించిన సయ్యద్ జకీర్ రహీమ్ దక్షిణ భారత దేశంలో పలువురు బీజేపీ నాయకుల హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక నిందితుడు. ఇతను హైదరాబాదులో ఉంటున్నాడు. అతనిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు.

Conspiracy to kill BJP leaders: Prime accused deported to India

తొలుత ఇతను మే 2016లో సౌదీ అరేబియాలో అరెస్టయ్యాడు. ఆ తర్వాత డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం సౌదీ ప్రభుత్వం అతనిని భారత్ పంపించింది. బీజేపీ నేతల హత్యలో ఫర్హతుల్లా ఘోరీకి ప్రథమ నిందితుడు.

2013లో బెంగళూరు పోలీసులు బీజేపీ నేతల హత్యకు సంబంధించిన కేసు కుట్రను చేధించారు. వీరు హైదరాబాద్, నాందెడ్‌లలో కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది. ఇప్పుడు ఆ నిందితుడిని హైదరాబాద్ తరలించారు. ఇతను గతంలో లష్కరే తోయిబా కోసం పని చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+