Ibomma రవి నేరచరిత్ర ఇదే.. పైరసీనే కాదు అవి కూడా.. సీపీ సజ్జనార్ సంచలనాలు!

తెలుగు సినిమా పరిశ్రమను పైరసీ లతో వేధించిన ఐ బొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజుతో సమావేశమైన తర్వాత హైదరాబాద్ సిపీ సజ్జనార్ ఐ బొమ్మ నిర్వాహకుడు రవికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు.

పైరసీనే కాదు రవి చేసింది ఇదే: సీపీ సజ్జనార్
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేవలం పైరసీ మాత్రమే కాకుండా, ఒక బెట్టింగ్ మాఫియా అని కూడా నడిపినట్టు , డార్క్ వెబ్ లో ప్రజల డేటాను అమ్ముకున్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ తెలిపారు. నవంబర్ 15వ తేదీన జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా అనేక ల్యాప్ ట్యాప్ లు, హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లు, సినిమా కాపీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

CP Sajjanar reveals the criminal history of Ibomma Ravi 21 000 pirated movies 65 mirror websites

Take a Poll

110డొమైన్ లు, 65మిర్రర్ వెబ్సైట్లు
ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా రవి 20కోట్ల రూపాయలు సంపాదించాడని వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసేవాడని ఆయన దగ్గర మొత్తం 65మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. అతని అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్లో మూడుకోట్ల రూపాయలను కూడా సీజ్ చేశారు. 2019నుంచి ఐ బొమ్మ నిర్వహిస్తున్న రవి 110డొమైన్ లను కొనుగోలు చేసి ఒక డొమైన్ బ్లాక్ అయితే మరొకటి ఉపయోగించేవాడని పేర్కొన్నారు.

రవి కారణంగాసినీ పరిశ్రమకు 24వేల కోట్ల రూపాయల నష్టం
మొత్తం 65 మిర్రర్ వెబ్సైట్ల ద్వారా 21వేల సినిమాలను హార్డ్ డిస్క్ లలో నిల్వచేసి అప్లోడ్ చేశాడని వెల్లడించారు. గాడ్ ఫాదర్ నుండి ఓజి వరకు బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు మిరాయ్, కాంతారా, డ్యూడ్ వంటి సినిమాలను పైరసీ చేసినట్టు పేర్కొన్నారు. ఐ బొమ్మ రవి కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు 24వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. రవిపై నాలుగు కేసులు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.

పోలీసులను తక్కువ అంచనా వెయ్యొద్దన్న సీపీ సజ్జనార్
పైరసీ సైట్ల తో పాటు, రవి టెలిగ్రామ్ లోను సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్య బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే పట్టుకోమని సోషల్ మీడియా ద్వారా పోలీసులకు సవాల్ విసిరిన ఐ బొమ్మ రవిని పట్టుకున్నామని, పోలీసులను తక్కువ అంచనా వేయొద్దని సజ్జనార్ పేర్కొన్నారు. ఇమ్మడి రవి పై ఐటి యాక్ట్, కాపీరైట్ చట్టం కింద మరో నాలుగు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

ఫ్రాన్స్ లో ఉంటూ పైరసీ రాకెట్ నడిపిన ఐ బొమ్మ రవి
విశాఖకు చెందిన రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివి తర్వాత వేర్వేరు పేర్లతో మహారాష్ట్రలో లైసెన్సులు, పాన్ కార్డులు సంపాదించినట్లు వెల్లడించారు. పోలీసులకు దొరకకుండా కరేబియన్ దీవులలో సెయింట్ కిడ్స్ అండ్ నేవీ పౌరసత్వం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో నివసిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతూ తన పైరసీ రాకెట్ ను నడిపించారని తెలిపారు. ఇక ఇటువంటి వారిని వదిలిపెట్టేది లేదని గట్టి హెచ్చరికను జారీ చేశారు సిపీ సజ్జనార్.

కేసు ఇంతటితో ముగియలేదు.. వారిని అరెస్ట్ చేస్తాం
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రశాంత్, శివరాజ్ వంటి వ్యక్తులను కూడా అరెస్టు చేశామని పేర్కొన్నారు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేసి 110 డొమైన్ లతో మిర్రర్ సైట్లను నిర్వహించినట్టు సజ్జనార్ తెలిపారు. ఈ కేసు ఇక్కడితో ముగిసిపోదని ఈ పైరసీ లలో రవికి సహకరించిన వారిని కూడా అరెస్టు చేస్తామని సజ్జనార్ వారిని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+