హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిహారం వద్దు, ఆ ఆభరణమే కావాలి: బ్యాంకు అధికారులకు తలనొప్పి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాకు పరిహారం వద్దు.... నా బంగారు ఆభరణమే కావాలంటూ చాలా మంది మహిళలు పరిహారం డబ్బులు తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో ఏమి చేయాలో తోచక బ్యాంకు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆంధ్రాబ్యాంక్ చోరీ కేసులో ట్విస్ట్: యాజమాన్యంపై కేసు వివరాల్లోకి వెళితే గతవారం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఖాతాదారులకు చెందిన 4.6 కిలోల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు వారం రోజులు పాట రెక్కీ నిర్వహించి మరీ దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు (ఫోటోలు)ఈ నేపథ్యంలో దొంగతనం జరిగి విచారంతో ఉన్న బ్యాంకు అధికారులకు మహిళలు పరిహారం తీసుకునేందుకు నిరాకరిస్తుండడం కాస్తంత మనోవేదనకు గురి చేస్తోంది. దొంగతనానికి గురైన లాకర్‌లో ఎక్కువగా మహిళలకు సంబంధించిన ఆభరణాలున్నాయి.

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి


మహిళలు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేయడమే కాకుండా, నగలను అపురూపంగా చూసుకునే విషయం తెలిసిందే. దీంతో తమ నగలు చోరీకి గురయ్యాయని తెలియడంతో వారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. బ్యాంకు అధికారుల నుంచి పరిహారం తీసుకునేందుకు ససేమేరా అంటున్నారు.

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి


ఎంతో ఇష్టపడి చేయించుకున్న తమ నగలే కావాలని అధికారులకు చెబుతున్నారు. ఆంధ్రాబ్యాంక్ దొంగతనం ఘటనపై కొంతమంది మహిళలు తమ భార్యలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తానెంత చెప్పినా వినకుండా నగలను బ్యాంకులో తనఖా పెట్టారు. ఇప్పడు వాటిని చోరీ చేశారని వాపోతున్నారని తెలుస్తోంది.

 పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి


మరికొందరైతే తమ పుట్టింటి వారు పెట్టిన నగలు అని బ్యాంకు అధికారులతో గొడవకు సైతం దిగుతున్నారు. బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేమని చెప్పడంతో చేసేదేమీలేక చివరకు కన్నీటి పర్యంతమవుతున్నారు.

 పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి


తమకు పరిహారం వద్దంటే వద్దు అంటూ తమకు సెంటిమెంట్‌గా ఉన్న అభరణాలే కావాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పోలీసులు పట్టుకుంటారని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చజెబుతున్నారు.

English summary
Customer twist in andhra bank robbery case at ghatkesar at hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X