సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం
కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కాగా, జనగణనలో కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు.
దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయన్నారు. జనాభా ప్రాతిపాదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు.

చట్ట సభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశపెట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. మహిళా బిల్లుతో బీజేపీ వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జనగణనలో కులగణన చేయాలని సీఎం రేవంత్ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందన్నారు. 100 ఏళ్ల క్రితం బెల్లామ్‌లో మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఆచరిస్తున్నారని చెప్పారు.
కులాలు, మతాల పేరిట రాజకీయం చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేశాన్ని విభజించి పాలించు అన్నది బీజేపీ ఎత్తుగడ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం. రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రభుత్వం కుల గణన చేపట్టింది. తెలంగాణలో 90 శాతం కులగణన పూర్తయింది. రాజ్యాంగాన్ని, చరిత్రను తిరిగిరాయలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కారుల, త్యాగ పురుషుల జీవిత చరిత్రలు నేటి తరానికి వివరించాలన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications