వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ ఊరి కథ: సైబర్ నేరాలపై కోచింగ్ సెంటర్, అమితాబ్‌నే బురిడీ కొట్టించాడట...

By Pratap
|
Google Oneindia TeluguNews

మంచిర్యాల : ఓ సైబర్ నేరస్థుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు దిమ్మ దిరిగే విషయాలు తెలిశాయి. బ్యాంక్ మేనేజర్ పేరుతో ఫోన్ చేసి ఎటిఎం వివరాలు తెలుసుకుని ఓ వ్యక్తి నుంచి రూ.21,380 లూటీ చేసిన నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఈ మోసం చేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హజీపుర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

డిసిపి జాన్‌వెస్లీ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన కళ్లెం రామారావు గుడిపేట పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం మనోజ్‌కుమార్ మండల్ అనే అపరిచిత వ్యక్తి సెల్.70 50944465 నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

ఎస్‌బీఐ మేనేజర్‌ను మాట్లాడుతున్న మీ ఏటీఎం కార్డు రెన్యూవల్ చేయాలని చెప్పడంతో రామారావు వెంటనే ఏటీఎం పైనున్న 16అంకెల నెంబర్‌ను చెప్పేశాడు. మళ్లీ వన్‌టైం పాస్‌వర్డ్(ఓటీపీ) అడగడంతో అదికూడా చెప్పాడు. దీంతో రామారావు ఖాతా నుంచి 21,380 డబ్బులు డ్రాచేశాడు. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రామారావు మరుసటి రోజు 29వ తేదీన అప్పటి హాజీపూర్ ఎస్‌ఐ రవిప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 420, ఐటీ సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు.

Cyber crime accused arrested in Manchiryala district

జార్ఖండ్‌లో అరెస్టు

కేసును సీరియస్‌గా తీసుకున్న రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ విచారణ ముమ్మరం చేశారు. కేసు పూర్వపరాలు తెలుసుకున్నారు. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జార్ఖండ్‌లో ఉన్నాడని తెలుసుకుని ఉన్నతాధికారుల అనుమతితో సీసీసీ నస్పూర్, హాజీపూర్ నుంచి పోలీస్ బృందాన్ని జార్ఖండ్‌కు పంపించారు.

హాజీపూర్ ఎస్‌ఐ తహసీనోద్దీన్, సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ మజీద్, కానిస్టేబుళ్లు భూమన్న, సురేష్‌లు జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లారు. జీపీఎస్ సిస్టం ద్వారా నిందితుడు మనోజ్‌కుమార్ సెల్ సిగ్నల్స్ జమ్‌తారా జిల్లా, కర్మతండ్ మండలం, కాశీతార్ గ్రామంలో చూపించడంతో అక్కడి పోలీసుల సహకారంతో మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గెలాక్సీ సెల్‌ఫోన్, వేలాది సెల్ ఫోన్ నెంబర్లు...

నిందితుడు మనోజ్‌కుమర్‌ను పట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిన పోలీసులు అతని ఇంట్లో సోదాలు చేశారు. సెల్‌ఫోన్ డాటా, మోసాలకు పాల్పడుతున్న తీరును చేసి పోలీసులు అశ్చర్యానికి గురయ్యారు. ఒక సామ్‌సాంగ్ గెలాక్సీ సెల్‌ఫోన్, వేలాది సెల్‌ఫోన్ నెంబర్లతో ఉన్న నోట్‌బుక్కు, బ్యాంక్ పాస్‌బుక్కు, బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఏటీఎం, బ్యాంక్ డిపాజిట్ స్లిప్ స్వాధీనం చేసుకున్నారు.

సైబర్ నేరాలపై కోచింగ్

మనోజ్‌కుమార్ గ్రామంలోని యువకులంతా సైబర్ నేరాలకు పాల్పడేవారనీని, కోచింగ్ సెంటర్ల ద్వారా ఇక్కడి యువకులకు సైబర్ నేరాలపై తరగతులు నిర్వహిస్తుంటారని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురైయ్యా రు. వారు నివసిస్తున్న ఊరు గుట్లల మధ్య ఉంటుంది. ఆ ఊరు కర్మన్ తండ. రెండేళ్ల క్రితం అది మామూలు గ్రామం. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో అన్నీ భవంతులే.

ఇలా ఫోన్లు చేస్తారు..

అక్కడి యువకుల్లో ఎక్కువ మంది చదువుకున్నవారే. చదువుకున్న ఆ యువకులు సైబర్ నేరాలకు పాల్పడుతూ వస్తున్నారు. వాళ్లు ఏదో ఒక సిరీస్ నుంచి ప్రారంభించి వరుసగా ఫోన్లు చేస్తారు. ఒక నెంబర్ పనిచేయకపోతే మరో నెంబర్‌కు ఫోన్ చేస్తారు. అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తితే తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని హిందీలో చెబుతారు. ఎటిఎం నెబర్లు తెలుసుకుని వారి డబ్బులను ఆన్‌లైన్‌లో విత్ డ్రా చేస్తారు. లక్కీ డ్రా తగిలిందని, డబ్బులు ఫలానా ఖాతాలో జమ చేయాలని నమ్మించి మోసం చేస్తుంటారు.

ఎలా మాట్లాడాలి, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్, ఇతర సైబర్ నేరాలు ఎలా చేయాలో నేర్పడానికి వాళ్లు అక్కడ ఓ సంస్థనే నడుపుతున్నారట. పట్టుబడిన నిందితుడు మనోజ్ కుమార్ స్నేహితుడు ఒకతను ఏకంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌నే బురిడీ కొట్టించి, ఆరు లక్షలు స్వాహా చేశాడట. ఎట్టకేలకు పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టారు.

అమితాబ్ స్వయంగా వచ్చాడట...

తనను మోసం చేసిన ఆ ఘనుడు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి స్వయంగా అమితాబ్ పోలీసులతో కలిసి తమ గ్రామానికి వచ్చాడని మనోజ్ పోలీసులకు చెప్పాడు. అదెంత వరకు నిజమో తెలియదు గానీ ఆ ఊరికి మాత్రం ప్రత్యేక ఉందని పోలీసులు గుర్తించారు. మనోజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత వ్యక్తులు, వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సంగెం జాన్‌వెస్లీ కోరారు. ఫెక్ ఫోన్స్ కాల్స్ వచ్చిన తర్వాత వారికి ఎలాంటి బ్యాంకు, ఏటీ ఎం సమాచారం ఇవ్వకుండా నేరుగా పోలీసులకు విషయం తెలపాలని విజ్ఞప్తి చేశారు. సైబర్‌నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

నేరస్తులు తప్పించుకునే అవకాశం లేద ని ఆయన తెలిపారు. జార్ఖండ్ రాష్ర్టానికి వెళ్లి నిం దితుడిని చాకచాక్యంగా పట్టుకున్న ఎస్‌ఐలు రాజేంద్రప్రసాద్, తహసీనోద్దీన్, హెడ్‌కానిస్టేబుల్ మజీద్, కానిస్టేబుళ్లు భూమన్న, సురేశ్‌ను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ దత్తద్రి హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్ ఎజాస్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Manchiryala district in Telangana police arrested a cyber crime accused Manoj Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X