మెసేజ్ క్లిక్‌తో సైబర్ వలలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్.. 2లక్షలకు పైగా నగదు మాయం!!

మెసేజ్ క్లిక్‌తో సైబర్ మోసానికి గురైన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ డబ్బు పోగొట్టుకున్నాడు.

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దోపిడీకి పాల్పడుతున్నారు. చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు అన్న తేడా లేకుండా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇక సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నవారు, సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా బ్యాంకు మేనేజర్లు, డిజిటల్ లావాదేవీల గురించి బాగా అవగాహన ఉన్నవారు కూడా ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సైబర్ మోసానికి గురైన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్

సైబర్ మోసానికి గురైన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్ కు వచ్చే మెసేజ్ లలో ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేయకూడదని ఖాతాదారులలో సైబర్ నేరాలపై అవగాహన కలిగించి, అప్రమత్తంగా ఉండాలని సూచించాల్సిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయారు. తన మొబైల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ లోని లింకును ఓపెన్ చేసి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఏకంగా రెండు లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్నారు.

సైబర్ నేరగాళ్ళు చెప్పింది చేసిన బ్యాంక్ ఉద్యోగి

సైబర్ నేరగాళ్ళు చెప్పింది చేసిన బ్యాంక్ ఉద్యోగి

సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతా డి యాక్టివేట్ అవుతుంది . వెంటనే పాన్ కార్డు అప్డేట్ చేయండి అంటూ ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ను క్లిక్ చేసి పాన్ కార్డ్ అప్డేట్ చేసేందుకు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ప్రయత్నించారు అది సక్సెస్ కాలేదు. అయితే ఈలోపు మరో నెంబర్ నుంచి ఆయనకు కాల్ వచ్చింది. తాను చెప్పినట్టు చేయాలని, అప్పుడే పాన్ కార్డు అప్డేట్ అవుతుందని చెప్పడంతో తాను బస్సులో ఉన్నానని చెప్పిన ఆయన బ్యాంకుకు వెళ్లిన తర్వాత వచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్డేట్ చేయాలని సూచించగా కావడం లేదని చెప్పారు. దీంతో ఈ మేరకు వేరే నెంబర్ నుంచి లింక్ పంపించగా దాన్ని అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఓపెన్ చేశారు. ఆపై వెంటనే ఆయన ఖాతా నుండి డబ్బులు మాయమయ్యాయి.

మెసేజ్ దెబ్బకు 2 లక్షలకు పైగా పోగొట్టుకున్న బ్యాంక్ అధికారి

మెసేజ్ దెబ్బకు 2 లక్షలకు పైగా పోగొట్టుకున్న బ్యాంక్ అధికారి

హనుమకొండ జిల్లా పరకాల ఎస్ బి ఐ బ్యాంకు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ సకల్ దేవ్ సింగ్ ఖాతా నుండి 2,24,967 రూపాయలు మాయమయ్యాయి. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయానని గుర్తించిన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి ఆ డబ్బులను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన బ్యాంకు ఉన్నతాధికారికే సైబర్ నేరస్థులు టోకరా వేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది.

అందిన కాడికి దోచుకునే పనిలో సైబర్ నేరగాళ్ళు

అందిన కాడికి దోచుకునే పనిలో సైబర్ నేరగాళ్ళు


ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినందుకు సంతోషపడాలో, లేక డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో బ్యాంకింగ్ ఫ్రాడ్లు పెరిగినందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి ఉంది. ఈ సైబర్ మోసాలకు అడ్డుకట్ట వెయ్యటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సరే నేరాలు మాత్రం ఆగటం లేదు. నిత్యం సైబర్ నేరగాళ్ళు ఏదో ఒక రకంగా అందిన కాడికి దోచుకునే పనిలోనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+