సీఎస్ పేరుతో ఫేక్ కాల్స్: సైబర్ టీంకు శాంతి కుమారి ఫిర్యాదు
హైదరాబాద్: ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోయాయి. సామాన్య ప్రజలకు ఆశ చూపించి నగదును తీసుకోవడం, వారి అకౌంట్లు నుంచి సమాచారాన్ని పొందడం చేస్తున్నారు. మరికొందరైతే ప్రముఖులను కూడా వదలడం లేదు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు.
తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా సైబర్ నేరగాళ్ల బెడద తప్పలేదు. తన ఫొటో డీపీగా పెట్టుకోని మోసాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు సీఎస్ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు.

నేపాల్ దేశానికి చెందిన +977-984-4013103 నంబర్‌తో కొందరు ఫోన్లు, మెసేజ్‌లు చేసి మోసాలు చేస్తున్నారని పోలీసులు శాంతి కుమారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన ఆమె సీఎస్ కార్యాలయం ప్రతినిధి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు తయారు చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. ప్రముఖుల పేర్లు, ఫొటోలు పెట్టి సామాన్యులకు సందేశాలు పంపి డబ్బు కాజేస్తున్నారని అలర్ట్ చేశారు. తెలియని వ్యక్తి నుంచి, నంబర్ నుంచి వచ్చే సందేశాలు, కాల్స్, వాట్సాప్ కాల్స్ ఇతర లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రముఖులు తమకు సందేశాలు పంపారని చెక్ చేసుకోకుండా ఎలాంటి లింక్‌లపై క్లిక్ చెయ్యవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications