Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈటలలా బర్తరఫ్ చేయాలి: మంత్రి మల్లారెడ్డిపై దాసోజు శ్రవణ్, మల్లు రవి తీవ్ర విమర్శలు

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి మద్దతు పలికారు. రేవంత్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గురువారం ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అవినీతిపై ప్రాథమిక ఆధారాలతోనే మాట్లాడారని చెప్పారు.

మల్లారెడ్డి కోడలు పేరున ఉన్న ఆస్పత్రి, మల్లారెడ్డి పేరుతో ఉన్న మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలు, విశ్వవిద్యాలయం భూములపై అవినీతి ఆరోపణలు చేస్తున్నామన్నారు. రుజువు చేయాలని డిమాండ్ చేస్తున్న మల్లారెడ్డి.. విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్‌ను అడగాలన్నారు. అంతేగాక, మంత్రి అవినీతి నిరూపించకపోతే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని వ్యాఖ్యానించారు దాసోజు శ్రవణ్. మంత్రి మల్లారెడ్డి అవినీతి నిరూపించకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి దీక్ష శిబిరంలో వేలాదిమంది సమక్షంలోనే ప్రకటించారు కదా అని ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో రాజకీయాలు చేయాలని చూస్తే తమకు కూడా అంతకంటే ఎక్కువ దూషణలు వచ్చని, ఆ విషయం మంత్రి మల్లారెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.

 Dasoju Sravan and Mallu Ravi hits out at minister Malla Reddy

మరోవైపు, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్ల రవి కూడా మంత్రి మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళిత గిరిజన బిసీ మైనార్టీ లకు లాభం జరగాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. రాజకీయంగా నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లి అంటున్నారని మల్లు రవి చెప్పారు.

తెలంగాణ వచ్చాక కేసీఆర్ దళిత గిరిజనులకు అణచి వెస్తున్నారు. అర్హులైన దళిత గిరిజన అధికారులను ప్రధాన్యత కలిగిన పోస్ట్ లను ఇస్తున్నారు. అగ్రవర్ణాల అధికారులు రిటైర్డ్ అయ్యాక కూడా తిరిగి పోస్ట్ లలో కొనసాగిస్తున్నారు. సీఎం ఆఫీస్‌లో పనిచేసే మెజారిటీ ఉన్నత ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులే అని మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి, అణచివేత ధోరణితోనే అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలి బయటికి వచ్చారని తెలిపారు.

ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన దళిత గిరిజన ఉద్యోగులను ఇలా అనగా దొక్కడం ఎంత వరకు సమంజసమని మల్లు రవి మండిపడ్డారు. బడ్జెట్‌లో దళిత గిరిజనులకు కేటాయించిన నిధులు ఎందుకు.పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవలంభిస్తున్న దళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ నే కాంగ్రెస్ దండోరా కార్యక్రమం, రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన దళితుల భూముల ఎందుకు గుంజుకుంటున్నారని ప్రశ్నించారు.

మూడు చింతలపల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్ళే రోడ్డు ఎత్తు పెంచడం వల్ల దళితుల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ గ్రామంలో దళితుల కష్టాలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మూడెకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదన్నారు. అయితే ఈ సమస్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లా రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్లు రేవంత్ పై బూత్ లు మాట్లాడటం సరైందేనా? మల్లారెడ్డి కి చిత్త శుద్ది ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ చేయించాలి. ఈటల రాజేందర్ పై విచారణ జరిపినట్లు మల్లారెడ్డి పై విచారణ జరిపించాలి. మల్లారెడ్డి రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉండేందుకు అర్హుడు కాడు. కేసీఆర్ మల్లారెడ్డి నీ బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మెల్యేలు,మంత్రులు చదువుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. దళిత గిరిజనుల కు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు అని మల్లు రవి స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి మల్లా రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన విమర్శలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంటులో కేంద్రమే ప్రకటించిందని తెలిపారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎపుడూ బ్రోకర్ దందా చేయలేదన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నా. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. మల్లారెడ్డి కళాశాలకు పార్లమెంటే క్లీన్ చీట్ ఇచ్చింది. నేను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలి!. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు మొదటి సంతకాలంటూ వాగ్ధానాలు చేస్తుండు. తెలంగాణలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నా పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయన్నారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని, అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినదని, కబ్జా భూమి లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని తెలిపారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాక, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తాను. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో అని రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు.

Recommended Video

    Spl Interview with Congress leader Dasoju Sravan

    ఇది ఇలావుండగా, మూడుచింతల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన రేవంత్ గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి భూములు కబ్జా చేసినట్టు ఆరోపించారు. మల్లారెడ్డి సగం జోకర్ తీవ్ర విమర్శలు చేశారు. భూములు అమ్మినా..? కొన్నా..? మల్లారెడ్డికి మాములు ఇవ్వాలని ఆరోపణలు గుప్పించారు. జవహర్ నగర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టిండని మండిపడ్డపడ్డారు రేవంత్. సూరారంలో చెరువును కబ్జా చేసి హాస్పిటల్ కట్టినట్టు ఆరోపణ చేశారు. ఇలా సర్కార్ భూములు కబ్జా చేసి.. ఆస్పత్రి, కాలేజీలు కట్టాడని.. మల్లారెడ్డి యూనివర్సిటీకి అనుమతి వచ్చిన భూమి కూడా దొంగ భూమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే.. మంత్రి మల్లారెడ్డి భూములపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అది తప్పు అని తేలితే నేను ఏ శిక్ష కైనా సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+