తల్లితో కలిసి తండ్రిని చంపేసి ప్రియుడితో సినిమాకెళ్ళిన కూతురు

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన కూతురు తల్లితో కలిసి తండ్రిని హతమార్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. జూలై 7వ తేదీన ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో ఒక మృతదేహం కనిపించడంతో మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు మృతదేహం పైన గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు.

వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కూతురు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం పాతబస్తీలోని ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శారద జిహెచ్ఎంసి లో స్వీపర్ గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మనిషాకు వివాహం చేయగా ఆమె వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడం వల్ల భర్త ఆమెను విడిచి పెట్టాడు.

Daughter killed father along with mother and lover went to the cinema after murder

తండ్రిని అడ్డు తప్పించుకునేందుకు కూతురు ప్లాన్
దీంతో మనీషా తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త స్నేహితుడైన మహమ్మద్ జావీద్ తో కలిసి మౌలాలిలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. ఇక కూతురు తన సంసారాన్ని నాశనం చేసుకొని ప్రియుడితో కలిసి ఉంటుందని తెలుసుకున్న లింగం ఆమెను మందలించాడు. ఇక ఇదే సమయంలో తండ్రి తల్లిని కూడా అనుమానిస్తున్నాడు అని గుర్తించిన మనీషా తల్లితో కలిసి పక్కాగా ప్లాన్ వేసింది .తండ్రిని అడ్డు తప్పించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

తల్లి ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసిన కూతురు
ఈ క్రమంలో జూలై 5వ తేదీన నిద్రమాత్రలు ఇచ్చి తల్లిని కల్లులో కలిపి తండ్రికి ఇవ్వాలని సూచించింది. దీంతో తల్లి శారద నిద్రమాత్రలు కలిపిన కల్లును భర్తకు తాగించింది. ఆ పైన తండ్రి నిద్రలోకి జారుకోవడం తో కుమార్తె మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారదతో కలిసి తండ్రి లింగాన్ని హతమార్చారు. నిద్రమత్తులో ఉన్న తండ్రి ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు.

తండ్రిని చంపి సెకండ్ షో సినిమాకి వెళ్ళిన తల్లీకూతురు.. ఆపై
ఆపై ప్రియుడితో కలిసి మనీషా సెకండ్ షో సినిమాకు వెళ్ళింది. అనంతరం క్యాబ్ బుక్ చేసుకుని వచ్చి తండ్రి కల్లు తాగి పడిపోయినట్లు గా క్యాబ్ డ్రైవర్ ను నమ్మిస్తూ తండ్రి మృతదేహాన్ని ముగ్గురు కలిసి ఎదులాబాద్ వద్ద దిగి మృతదేహాన్ని చెరువులో పడేశారు. తండ్రి కనిపించటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయించింది సదరు క్రిమినల్ కూతురు. దీనిపైన దర్యాప్తు చేసిన పోలీసులు ఎదులాబాద్ చెరువు సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించగా కోర్టు వీరికి రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+