6 నెలల్లోనే కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు: నాలుగేళ్ల బాలికపై రేప్, హత్య, నేరస్తుడికి ఉరిశిక్ష

నాలుగేళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి, ఆ తర్వాత హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ ఫస్ట్ క్లాస్ అదనపు న్యాయస్థానం గురువారం నాడు సంచలన తీర్పు చెప్పింది.

కరీంనగర్: నాలుగేళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి, ఆ తర్వాత హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ ఫస్ట్ క్లాస్ అదనపు న్యాయస్థానం గురువారం నాడు సంచలన తీర్పు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది.

నిందితుడు జక్కుల వెంకటస్వామి. అతను నాలుగేళ్ల చిన్నారి పైన అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చంపేశాడు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. మృతి చెందిన చిన్నారిది నిందితుడి గ్రామమే. కేసుకు సంబంధించి తగిన ఆధారాలు చూపించడంతో వెంకటస్వామికి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

కేవలం ఆరు నెలల వ్యవధిలో ఈ కేసుపై కోర్టు తీర్పు చెప్పడం గమనార్హం. నిందితుడిది కాటారం మండలం దామెరకుంటకు చెందిన వ్యక్తి. అతను చిన్నారి గొంతు కోసి గంప కింద దాచి పెట్టాడు. మహిళా సంఘాల పోరాటంతో అతనికి శిక్ష పడింది.

కాగా, జక్కుల వెంకట స్వామి భార్య గతంలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతను జులాయిగా తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఓ మహిళ పైన అత్యాచారయత్నం చేశాడు. అనంతరం ఈ చిన్నారి పైన ఘాతుకానికి పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+