ఎందుకు అలా: చిన్న విషయమే.. పవన్ కళ్యాణ్ సంతకంపై ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమస్యలపై వరుసగా స్పందిస్తున్నారు. తనకు అందుబాటులో ఉన్న వేదికల ద్వారా ఆయన సమస్యలను లేవనెత్తుతున్నారు.

పవన్ లేవనెత్తే సమస్యలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి కూడా. ట్విట్టర్ ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా.. ఇలా ఆయన వివిధ అంశాలపై స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సంతకంపై..

పవన్ కళ్యాణ్ సంతకంపై..

పవన్ కళ్యాణ్ ఇస్తున్న పత్రికా ప్రకటనల్లో చిన్నపాటి పొరపాటు దొర్లుతోందని అంటున్నారు. అదే ఆయన సంతకం. ఆయన సంతకాలపై వెబ్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పవన్ సంతకాలలో మార్పులు

పవన్ సంతకాలలో మార్పులు

సాధారణంగా ఎవరైనా ఒకే సంతకాన్ని పెడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ సంతకాలలో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు. జనసేన వివిధ సందర్భాలలో విడుదల చేసిన ప్రెస్ నోట్లపై సంతకాలు వేర్వేరుగా ఉంటున్నాయి.

దీంతో అసలు ప్రెస్ నోట్ల పైన పవన్ కళ్యాణ్ సంతకాలు చేస్తున్నారా లేదా అనే అనుమానం కూడా కలిగేలా ఉందని అంటున్నారు.

ప్రెస్ నోట్లలో..

ప్రెస్ నోట్లలో..

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు తెలిపిన వివిధ సందర్భాలలో విడుదల చేసిన ప్రెస్ నోట్లలో తెలుగులో సంతకం చేశారు. మరో దాంట్లో పవన్ ఇంగ్లీష్‌లో సంతకం చేశారు.

విషయం చిన్నదే కానీ..

విషయం చిన్నదే కానీ..

ఇంగ్లీష్, తెలుగు సంతకాలు వేర్వేరుగా ఉండటంలో అర్థం ఉంది. కానీ ఇంగ్లీష్‌లో వేర్వేరు ప్రెస్ నోట్లలో చేసిన సంతకాల్లోనే తేడా ఉందంటున్నారు. ఈ విషయం చిన్నదే అయినప్పటికీ చర్చ జరుగుతోంది. తెలుగులో ఒకటి, ఇంగ్లీష్‌లో రెండు విధాలుగా.. మొత్తం మూడు రకాలుగా సంతకాలు ఆయన పెడుతున్నారట.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Debate in Socia sites on Jana Sena chief Pawan Kalyan's signature on Press notes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి