డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం!!
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో డిప్యూటీ సీఎం విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు హోమియోపతిలో ఎండి చదివి ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గాను, అడిషనల్ డైరెక్టర్ గానే పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన వైరా నుండి ఒకటవ వార్డులో తన నివాసంలోనే హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. మంచి హోమియో వైద్యునిగా ఆయనకు ప్రజల వద్ద గుర్తింపు ఉంది.

మల్లు వెంకటేశ్వర్లు వద్ద వైద్యం చేయించుకోవడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి రోగులు వస్తారు. సామాజిక బాధ్యతతో వచ్చిన వారందరికీ వైద్య సేవలు ఆయన అందించేవారు. డబ్బు కోసం కాకుండా వైద్యుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన విశేషమైన సేవలు అందించారు.
అయితే గత మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించటంతో ఇటీవల గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో ఆయనను చేర్పించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతున్న క్రమంలోనే మూడు రోజుల క్రితం ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది.
దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఇక ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మల్లు వెంకటేశ్వర్లు మృతదేహానికి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. మల్లు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్థానికులు, స్నానాల లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి వైద్యుడిని కోల్పోయామని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications