Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ట్విస్ట్: 6 నెలలుగానే ఆర్ జె స్టూడియోలో శిరీష వర్క్, మాజీడిజిపి ఘటనపై విచారణ

బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్యల కేసు విషయమై రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ డిజిపి కోటేశ్వర్ రావును కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బెదిరించిన ఘటనపై డిజిపి అనురాగ్

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్యల కేసు విషయమై రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ డిజిపి కోటేశ్వర్ రావును కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బెదిరించిన ఘటనపై డిజిపి అనురాగ్ శర్మ విచారణకు ఆదేశించారు.

బ్యూటీషీయన్ శిరీష కేసు విషయమై మొదటి నుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కూడ ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు ప్రకటించారు.

అయితే ఈ రెండు ఆత్మహత్యలకు సంబంధించి పోలీసులు చెబుతున్న వాదనలతో ఈ రెండు కుటుంబసభ్యులు మాత్రం విబేధిస్తున్నారు. వీరిద్దరిది కూడ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాళ్ళు కాదంటున్నారు.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసు విషయమై సక్రమంగా దర్యాప్తు చేయకుండా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోలీసులు ఫోకస్ చేస్తున్నారని శిరీష భర్త సతీష్ చంద్ర ఆరోపణలు చేశారు.

 మాజీ డిజిపి కోటేశ్వర్ రావును ఘటనపై విచారణకు ఆదేశం

మాజీ డిజిపి కోటేశ్వర్ రావును ఘటనపై విచారణకు ఆదేశం

మాజీ డిజిపి కోటేశ్వర్ రావును కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బెదిరించిన కేసు విషయమై విచారణకుఆదేశాలు జారీచేశారు డిజిపి అనురాగ్ శర్మ. ప్రభాకర్ రెడ్డి మాజీ డిజిపి కోటేశ్వర్ రావును బెదిరించిన ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మాజీ డిజిపి కోటేశ్వర్ రావు విషయంలో బంజారాహిల్స్ పోలీసులు అనుసరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ డిజిపి కోటేశ్వర్ రావును పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకొన్నాడు

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకొన్నాడు

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు విషయమై కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకొన్నాడని ఆయన ప్రశ్నించారు.ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఎందుకు గుర్తించలేదన్నారు. కేసును దర్యాప్తు చేసిన ఎస్ఐ వినోద్ కు, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఏమైనా సంబంధాలున్నాయా అనే విషయాలపై విచారణ చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

మేం సంతోషంగా ఉన్నాం

మేం సంతోషంగా ఉన్నాం


తాము సంతోషంగా ఉన్నామని బ్యూటీషీయన్ శిరీష భర్త సతీష్ చంద్ర చెప్పారు. ఆయన ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఈ కేసు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదన్నారు. రోజూ మీడియాలో చూపించి, తన భార్య క్యారెక్టర్ పై లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పారు. చెవిటి, మూగ పిల్లలకు తాను వంటచేసి పెడతానని ఆయన చెప్పారు. ఆశ్రే ఆకృతి సంస్థలో తాను వంట మనిషిగా పనిచేస్తానని చెప్పారు. తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవన్నారు.

ఆర్ జె స్టూడియోలో చేరి ఆరు మాసాలే అవుతోంది

ఆర్ జె స్టూడియోలో చేరి ఆరు మాసాలే అవుతోంది

తన భార్య శిరీష ఆర్ జె స్టూడియోలో చేరి ఆరుమాసాలే అవుతోందని సతీష్ చంద్ర చెప్పారు. ఈ స్టూడియోలో పార్ట్ టైమ్ గా పనిచేస్తోందన్నారు. బెంగుళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్ లో కూడ ఆమె పనిచేస్తోందన్నారు. సుమారు ఏడాది నుండి శిరీష అక్కడే పనిచేస్తోందని చెప్పారు. నెలకు ముప్పై నుండి నలభైవేల వరకు ఆమె సంపాదిస్తోందన్నారు. తాను నెలకు పదిహేను వేలను సంపాదిస్తానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+