'మెగా హీరో' ఇమేజ్ వద్దంటున్న అల్లు అర్జున్?
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లోని ఓ వర్గం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదగడానికి వెనక చిరంజీవి కృషిచేసినా ఆ విషయాన్ని అల్లు అర్జున్ ఒప్పుకోవడంలేదని, అతను తన సొంతంగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగా అభిమానుల్లో ఓవర్గం ఫిర్యాదు చేస్తోంంది. అంతేకాదు సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
పుష్ప సినిమాతో బన్నీకి ఇండియా వైడ్ ఒక యునీక్ ఐడెంటిటీ వచ్చింది. బన్నీలోని ఈ యునీక్ క్వాలిటీ మెగా అభిమానులకు నచ్చినా మెగాస్టార్ చిరంజీవిని విస్మరించడం ఒక సెక్షన్ ఫ్యాన్స్‌కి రుచించడంలేదు. దివంగత అల్లు రామలింగయ్య ఫొటోను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి మై ఫౌండేషన్ అనే ట్యాగ్ ఇచ్చారు. దీనిపై చిరు అభిమానులు విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ సాధించిన విజయాలకు చిరంజీవి మూలస్తంభమని చిరు అభిమానులు అంటుంటే అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఎక్కడ? అంటూ బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలో జరిగిన మెగా అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్ లేకుండా చిరంజీవి, పవన్, నాగబాబు, చరణ్ పోస్టర్లు మాత్రమే కనిపించాయి. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని బాలకృష్ణ హోస్ట్ చేయడం పై మెగా అభిమానులకు ఇప్పటికీ మింగుడుపడటంలేదు. ఈ వైరం పెద్దదవుతుండటంతో అల్లు అరవింద్ రెండువైపులా సర్దిచెబుతున్నారు.
ప్రొఫెషన్ రీత్యా బన్నీ లేదా తన తమ్ముడు పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగాలని కోరుకుంటానని, అంతేకాదు తన కంటే గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశ పడితే అందుకు తాను ఎంతగానో సంతోషిస్తానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆ స్పిరిట్ అందరిలోనూ ఉండాలన్నారు. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
చిరు బ్రాండ్ తో కాకుండా అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్ తో ఎదగాలనుకుంటున్నారు. ఇది ఎటువంటి తప్పు కాదు. అయితే చెట్టు పేరు చెప్పుకొని కాయలు ఎంతకాలం అమ్ముకోవాలని, అల్లు అర్జున్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని బన్నీ అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications