వైరల్ వీడియో: హైదరాబాద్ లోని ఆ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా..?
హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. అలాగే వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే 85 లక్షల 22 వేల 286 కు చేరినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అటు ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో పెట్రోల్ స్కామ్ జరుగుతోందని కథనాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Petrol Scam
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 20, 2025
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్డు వద్ద ఉన్న HP పెట్రోల్ పంప్లో భారీ పెట్రోల్ స్కామ్
పెట్రోల్‌కి బదులు నీళ్లు వేస్తున్న యాజమాన్యం.. దీంతో ముందుకు కదలని వాహనాలు
అనుమానం వచ్చి పరిశీలించగా.. పెట్రోల్ బదులు నీళ్లు ఇస్తున్నారని గుర్తించిన కస్టమర్లు#PetrolScam… pic.twitter.com/cC2kCP6QeP
ఇటీవలి కాలంలో హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల్లో రీడింగ్ తప్పు చూపిస్తూ మోసానికి పాల్పడున్న ఘటనలు బయటకు వచ్చాయి. తాజాగా భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బదులు నీళ్లు పోస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శేరిగూడలో ఓ వ్యక్తి రాత్రి సమయంలో తన కారులో పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్దామని కారు తీయగా అది స్టార్ట్ కాలేదు. కారును మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తే పెట్రోల్ ట్యాంకులో నీళ్లు చేరాయని.. ఇంజిన్ పాడైపోయిందని చెప్పడంతో కారు యాజమాని షాకయ్యాడు.

తాజాగా సోమాజిగూడ HP పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కు బదులు నీళ్లు కలిపేస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చి పరిశీలించారు. పెట్రోల్ బదులు నీళ్లు ఇస్తున్నారని కస్టమర్లు గుర్తించారు. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం పెట్రోల్ కు బదులు నీళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. బంకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications