Hyderabad news:జుమ్మెరాత్ బజార్-సగం రేటుకే వస్తువులు-ఐకానిక్ మార్కెట్..!
ఇది ఈ-కామర్స్ యుగం. ఏది కావాలన్న ఒక క్లిక్‌తో ఇంటికే ఆ వస్తువు డెలివరీ అవుతుంది.అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు వచ్చాక బజారుకెళ్లి ఫలానా వస్తువులు కొనడం చాలా వరకు తగ్గింది. అంతేకాదు చోటా మోటా దుకాణాదారులకు కష్టకాలం ప్రారంభమైంది. ఆన్‌లైన్ షాపింగ్ సంస్థల రాకతో వ్యాపారస్తులు కుదేలయ్యారు.అయితే హైదరాబాద్‌లో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న వీక్లీ మార్కెట్ జుమ్మెరాత్ బజార్‌పై మాత్రం ఈ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు ప్రభావం చూపలేకపోయాయి. ఇంతకీ జుమ్మెరాత్ బజార్ ఏంటి..? ఎక్కడుంది..?
జుమ్మెరాత్ బజార్... పేరు వినేందుకు చాలా వెరైటీగా ఉంది కదూ.దీన్నే గురువారం మార్కెట్ అని కూడా అంటారు. అంటే వారంలో ప్రతి గురువారం ఈ బజారు జరుగుతుంది. ఓల్డ్ సిటీలోని ముసాలంజంగ్ బ్రిడ్జ్ నుంచి పురాణాపూల్ బ్రిడ్జ్ అంటే దాదాపుగా 2 కిలోమీటర్ల మేరా ఈ బజారు ఉంటుంది. ప్రతి గురువారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బజారు ఉంటుంది.

జుమ్మెరాత్ బజార్‌కు ప్రతి వారం కొన్ని వేలమంది వచ్చి తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి వెళుతుంటారు. ఈ బజారులో తివాచీలు, ఆటోమొబైల్ విడిభాగాలు,బట్టలు, హెర్బల్ మెడిసిన్స్, సైకిళ్లు, సెకండ్ హ్యాండ్ కిచెన్ ఐటెమ్స, వాచీలు,టేప్ రికార్డర్లు,రేడియోలు, టీవీలతో పాటు గృహాలకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో కనుమరుగైన కొన్ని వస్తువులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. పురాతన వస్తువులు సేకరించే ఆసక్తి ఉన్నవారు కచ్చితంగా జుమ్మెరాల్ బజార్‌ను సందర్శిస్తారు.
గత నాలుగు దశాబ్దాలుగా ఈ జుమ్మెరాత్ బజార్‌ను నిర్వహిస్తూ వ్యాపారస్తులు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.తరాలు మారినప్పటికీ, వారి వారసులు మాత్రం ఇంకా ఇక్కడ వస్తువులను అమ్ముతున్నారంటే ఈ మార్కెట్‌కున్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతి గురువారం ఉదయం 5 గంటల నుంచే జుమ్మెరాత్ బజార్‌కు కస్టమర్ల రాక ప్రారంభం అవుతుంది. అది క్రమంగా పెరిగి ఈ ప్రాంతం రద్దీగా మారుతుంది. ఉదయం 8 గంటలకల్లా ఈ మార్కెట్ వ్యాపారస్తులతో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. ఇక 11 గంటలకల్లా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొందరు రావాలనుకున్న వారు తమ ఆలోచనను విరమించుకుంటారు.

జుమ్మెరాత్ బజార్‌లో ప్రత్యేక ఆకర్షణ వస్తువుల వేలంపాట. ప్రెజర్ కుక్కర్ నుంచి బెడ్ షీట్లు దిండు కవర్లు,చాపలు,ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఇతర వస్తువులను వేలం వేస్తారు. ఎవరు ఎక్కువ పాడితే వారికే ఆ వస్తువు సొంతం అవుతుంది.ఈ మార్కెట్ నిజాం కాలం నుంచే ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. తమకు గుర్తున్నంత వరకు ఈ మార్కెట్ 50 ఏళ్ల నుంచి నడుస్తోందని ఓ 70 ఏళ్ల వృద్ధుడు స్పష్టం చేశారు.2020లో కరోనా కారణంగా మార్కెట్ 8 నెలల పాటు మూతపడింది. అంతే తప్ప క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఈ మార్కెట్లో సందడి అంతా ఇంతా కాదు. వీలైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మార్కెట్‌ను సందర్శించి ఇక్కడి వాతావరణాన్ని ఒకసారి ఫీల్ అవ్వాల్సిందే.












Click it and Unblock the Notifications