కేసీఆర్! రేపు మేమూ మీలాగే చేస్తే పరిస్థితి ఏంటి: రేవంత్ ఇంటికి డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటికి ఆ పార్టీ నేత డీకే అరుణ శుక్రవారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం వద్ద మాట్లాడారు. ఐటీ, ఈడీ దాడులు కక్ష సాధింపు చర్యలే అన్నారు. తెరాసకు రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేదన్నారు.
Recommended Video

ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక మేమూ ఇలాగే చేస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెరాసకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. తమిళనాడు రాజకీయాలు చక్కటి ఉదాహరణ అన్నారు. తెరాస కుటుంబమే రాష్ట్రాన్ని పాలించాలనే కుట్ర జరుగుతోందన్నారు.

తెలంగాణ ప్రజలు బానిసలుగా బతకాలని తెరాస ఆలోచన చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ఈ దొరల పాలనకు చెక్ పెట్టడం ఖాయమని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని వ్యాఖ్యానించారు.
తెలంగాణను తెరాస దోచుకుంటోందని ఆరోపించారు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. కేసులు పెట్టిస్తామని, జైల్లో పెట్టిస్తామని బెదిరింపులు మంచిది కాదన్నారు. మీరు చేతకాని దద్దమ్మలు అయి తమను ఎదుర్కోలేక కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications