మూసీ నది ఒడ్డున ఉండే పేదలకు 10వేల డబుల్ బెడ్రూం ఇళ్లు, కబ్జాల తొలగింపు: కేటీఆర్

హైదరాబాద్: నగరంలో మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ అభివృద్ధి అంశాల‌పై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చ‌ర్చించారు.

మూసీ ప‌రిధిలోని పేద‌ల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మూసీ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపులో ఇళ్లు కోల్పోయిన వారికి ప్ర‌భుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాల‌ని ఎమ్మెల్యేలు ఏక‌గ్రీవంగా మంత్రికి విన‌తిప‌త్రం సమ‌ర్పించారు.

double bedroom houses for the poor, who lives at musi river area in hyderabad: KTR

సుమారు 10 వేల ఇండ్ల‌ను కేటాయించాల‌ని ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తిపాదించారు. ఈ క్ర‌మంలో మూసీలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాక అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఇప్ప‌టికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి ప‌నుల‌పై ప్రాథ‌మిక విచార‌ణ పూర్త‌యింది.

హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపైన మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన మూసీ నదిలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు.

కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యుత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎస్ఎన్ డీపీ రెండవ దశ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు, ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని.. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+